Vijayasai Reddy : అమరావతి : మాజీ ఎంపీ విజయ సాయి రెడ్డి (Vijayasai Reddy) సంచలన కామెంట్స్ చేశారు. ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ప్రముఖ నటుడు, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదలపై. పవర్ స్టార్ తో తనకు 20 ఏళ్ల స్నేహ బంధం ఉందన్నారు. తాను ఏనాడూ ఆయనను ఉద్దేశించి ఒక్క మాట కూడా మాట్లాడ లేదన్నారు. భవిష్యత్తులో కూడా తన గురించి ఒక్క పల్లెత్తు మాట్లాడ బోనంటూ ప్రకటించారు. కొందరు కావాలని తనను బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విజయ సాయి రెడ్డి మీడియాతో మాట్లాడారు. నేను ప్రస్తుతం పూర్తిగా రాజకీయాలకు దూరంగా ఉన్నానని చెప్పారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్కర్లేదన్నారు.
Ex MP Vijayasai Reddy Shocking Comments
కావాలని అనుకుంటే, తనకు రాజకీయాలలకి రావాలని అనిపిస్తే తిరిగి తప్పకుండా వస్తానని స్పష్టం చేశారు విజయ సాయి రెడ్డి. పాలిటిక్స్ వేరు పార్టీలు వేరు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయని, అలా ఉండడంలో తప్పు లేదన్నారు. అవసరం అని అనుకుంటే తాను తప్పకుండా రీ ఎంట్రీ ఇస్తానని ప్రకటించారు. అయితే తనకు ప్రస్తుతం ఏ పార్టీలో చేరే ఉద్దేశం లేదన్నారు. తాను వైఎస్సార్సీపీ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత తనకు ఇప్పటి వరకు ఒక్క పార్టీ నుండి కూడా రావాలని, చేరాలని కోరలేదని చెప్పారు విజయ సాయి రెడ్డి.
Also Read : Mandanna Wedding Postpone Sensational : తండ్రికి సీరియస్ మంధన్నా పెళ్లి వాయిదా


















