ఇంగ్లండ్ : భారత జట్టు మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ దినేష్ కార్తీక్ నిప్పులు చెరిగాడు. చెత్త ఆటతో వరుసగా ఓటమి పాలవుతూ వస్తున్న భారత జట్టు ఆట తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రత్యేకించి హెడ్ కోచ్ గౌతం గంభీర్ ను ఏకి పారేశాడు. ఇప్పటికే టెస్టు మ్యాచ్ లను కోల్పోయాం. న్యూజిలాండ్ , దక్షిణాఫ్రికా వంటి జట్లు సొంత గడ్డపైనే మనల్ని వైట్‌వాష్ చేశాయి. అది చాలదన్నట్లు, ఐర్లాండ్ , ఇంగ్లాండ్ టీ20లలో చిత్తుగా ఓడించాయి. వన్డేలలో మాత్రమే మాకు ఆశ మిగిలింది. కానీ దురదృష్టవశాత్తు ఇది కూడా అనుకూలంగా లేదు. గత నెల రోజులుగా జట్టు బౌలింగ్ తీవ్ర నిరాశకు గురిచేసింది. భారత జట్టు ఇంత ఘోరంగా పతనమవడం నేను ఇంతకు ముందెన్నడూ చూడలేదని అన్నాడు దినేష్ కార్తీక్.
యాజమాన్యం, కోచింగ్ సిబ్బంది, ఆటగాళ్లు మరింత మెరుగ్గా రాణించాల్సిన అవసరం ఉందన్నాడు. ఈ విషయంలో నాకు మాటలు రావడం లేదు. గౌతమ్ గంభీర్, అతని జట్టు ఈ అవమానం నుండి గుణపాఠం నేర్చుకోవాలని అని పేర్కొన్నాడు. ఇక కుల్దీప్ యాదవ్ మరోసారి మోసపోయినట్లు భావిస్తాడు. జట్టులోని ఆల్‌రౌండర్లందరితో బరిలోకి దిగే ఈ కూర్పు నాకు అర్థం కావడం లేదు. తమ టాప్ 6 బ్యాటర్లపై యాజమాన్యానికి పెద్దగా నమ్మకం లేదని ఇది స్పష్టంగా సూచిస్తోంది. ఈరోజు వారు స్పెషలిస్టులతో బరిలోకి దిగారు, కానీ కుల్దీప్‌ను మాత్రం పక్కన పెట్టారు. అతను ప్రపంచంలోని అత్యుత్తమ స్పిన్నర్లలో ఒకడు, అతన్ని తొలగించడం ద్వారా యాజమాన్యం మరోసారి పెద్ద తప్పు చేసింది. ఆల్‌రౌండర్లతో బరిలోకి దిగే ఈ వ్యూహం భవిష్యత్తులో వికటిస్తుంది. ప్రధాన టోర్నమెంట్లలో మనల్ని తీవ్రంగా వెంటాడుతుందని రవిశాస్త్రి మండిపడ్డాడు.


















