ముంబై : భారత జట్టు మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ వీరేంద్ర సెహ్వాగ్ నిప్పులు చెరిగాడు. భారత జట్టు పేలవమైన ఆట తీరుపై మండిపడ్డారు. ఆపై సెలెక్షన్ ఎంపిక విధానాన్ని తప్పు పట్టాడు. హెడ్ కోచ్ గంభీర్ , కెప్టెన్ శుభ్ మన్ గిల్ లను ఏకి పారేశాడు. వాళ్లు తమ స్వంత టీంను ఏర్పాటు చేసుకుంటున్నారని, జాతీయ జట్టును పరిగణలోకి తీసుకోవడం లేదంటూ సంచలన ఆరోపణలు చేశాడు. అంతే కాదు గంభీర్ గిల్ లు పక్షపాత జట్టు ఎంపిక చేస్తున్నారంటూ మండిపడ్డాడు. ప్రదర్శనకు తగిన ప్రతిఫలం ఇవ్వకుండా, కేవలం తమ వ్యక్తిగత ఇష్టమైన ఆటగాళ్లను మాత్రమే ఎంచుకుంటూ, అత్యంత పక్షపాత ఎంపిక విధానాన్ని నడుపుతున్నారని గౌతమ్ గంభీర్ , శుభ్‌మన్ గిల్‌లను వీరేంద్ర సెహ్వాగ్ నిర్దాక్షిణ్యంగా బహిర్గతం చేశాడు.
దేశీయ ,, ఐపీఎల్‌లో బ్యాటింగ్ లైనప్‌లను చిన్నాభిన్నం చేస్తున్నప్పటికీ, భువనేశ్వర్ కుమార్ , మహమ్మద్ షమీ వంటి ఫామ్‌లో ఉన్న అనుభవజ్ఞులైన సీనియర్ ఆటగాళ్లను ఎందుకు నిరంతరం విస్మరిస్తున్నారని సెహ్వాగ్ ప్రశ్నించాడు. ఈ రోజు వారిలో ఒక్కరైనా ఉండి ఉంటే మ్యాచ్ పూర్తిగా మారిపోయి ఉండేదన్నాడు. మీరు కేవలం మీకు వ్యక్తిగతంగా నచ్చిన ఆటగాళ్లనే ఎంచుకోవాలని అనుకుంటే, మిగతా వారు అసలు దేశీయ క్రికెట్ ఎందుకు ఆడుతున్నారని ప్రశ్నించాడు. ఇదే సమయంలో గంభీర్, గిల్ ల పక్షపాత వైఖరి వల్ల జట్టు లో సమతుల్యత లోపిస్తుందని, ఇది విజయాలు ఎలా సాధిస్తుందని నిలదీశాడు సెహ్వాగ్.


















