అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలందరికీ అభినందనలు తెలిపారు. అద్భుతమైన విజయాలతో మన సినిమాకు గొప్ప గర్వకారణంగా నిలిచిన నటులు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, తెలుగు చలనచిత్ర రంగానికి చెందిన ప్రతి ఒక్కరికీ ఆయన తన సందేశం ద్వారా అభినందనలు తెలియజేశారు. కళ, సంస్కృతి , సినిమా మన గుర్తింపు , వారసత్వానికి శాశ్వత స్తంభాలు. తెలుగు సినిమా తన అద్భుతమైన ప్రతిభతో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహిస్తూ, తరాలకు స్ఫూర్తినివ్వాలని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా టాలీవుడ్‌కు సంబంధించి 10 అవార్డులు దక్కాయి.
వాటిలో ఉత్తమ ప్రజాదరణ పొందిన చిత్రం కల్కి 2898 AD, ఉత్తమ స్క్రీన్‌ప్లే సుకుమార్ (పుష్ప 2), ఉత్తమ తెలుగు చిత్ర కమిటీ కుర్రోళ్ళు, ఉత్తమ బాలల చిత్రం 35 చిన్న కథ కాదు, ఉత్తమ మేకప్ అవార్డు పి. రవి కుమార్ – కమిటీ కుర్రోళ్ళు , ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ పుష్ప 2 – దీపాలి , శీతల్ శర్మ, ఉత్తమ ప్రొడక్షన్ డిజైనర్ నితిన్ జిహాని చౌదరి – కల్కి 2898 AD., ఉత్తమ సంభాషణల కేటగిరీలో లక్కీ భాస్కర్ మూవీకి గాను దర్శకుడు, రచయిత వెంకీ అట్లూరి, ఉత్తమ బాల నటుడు అరుణ్ దేవ్ పోతుల – 35 చిన్న కథ కాదు సినిమాకు గాను జాతీయ స్థాయిలో అవార్డులు దక్కడం పట్ల సీఎం సంతోషం వ్యక్తం చేశారు. నారా చంద్రబాబు నాయుడుతో పాటు అగ్ర నటుడు మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు, తదితరులు అభినందించారు విజేతలను.



















