చెన్నై : తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా కేంద్ర సర్కార్ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. ఇందులో తమిళ సినీ పరిశ్రమకు చెందిన పలువురికి ఉత్తమ స్థాయిలో అవార్డులు దక్కాయి. దీనిపై స్పందించారు సీఎం. సినీ రంగానికి మరింత విజయం లభించాలని ఆకాంక్షిస్తూ, భవిష్యత్తులో తమిళ చలనచిత్ర పరిశ్రమ మరిన్ని ఇలాంటి పురస్కారాలను సాధిస్తుందని ముఖ్యమంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. మూడు కీలక విభాగాల్లో అవార్డులు గెలుచుకున్న ‘అమరన్’ చిత్ర బృందాన్ని సీఎం అభినందించారు. ఇందులో రాజ్ కుమార్ పెరియసామి ఉత్తమ దర్శకుడిగా, ఆర్. కలైవనన్ ఉత్తమ ఎడిటింగ్ విభాగంలోనూ, జి.వి. ప్రకాష్ కుమార్ ఉత్తమ నేపథ్య సంగీత విభాగంలోనూ అవార్డులు సాధించారు.
ఇదిలా ఉండగా ఈ జాతీయ చలనచిత్ర అవార్డులలో రాష్ట్ర సినీ రంగానికి చెందిన కళాకారులు 10 పురస్కారాలను గెలుచుకోవడం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఆదివారం అభినందనలు తెలిపారు. 2024లో విడుదలైన చిత్రాలకు గాను వివిధ విభాగాల్లో తమిళ సినీ రంగం ఘనవిజయం సాధించడం రాష్ట్రానికి గర్వకారణమని ఆయన ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు. . విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఉత్తమ తమిళ చిత్రంగా అవార్డు గెలుచుకున్న ‘రాయన్’ చిత్రానికి దర్శకత్వం వహించిన నటుడు-దర్శకుడు ధనుష్‌ను విజయ్ ప్రశంసించారు. అలాగే ‘కెప్టెన్ మిల్లర్’ చిత్రంలోని నటనకు గాను ధనుష్ ఉత్తమ నటుడి విభాగంలో ప్రత్యేక ప్రస్తావన పొందారు. ‘అమరన్’ చిత్ర బృందాన్ని కూడా సీఎం అభినందించారు; ఇందులో రాజ్ కుమార్ పెరియసామి ఉత్తమ దర్శకుడిగా, ఆర్. కలైవనన్ ఉత్తమ ఎడిటింగ్ విభాగంలోనూ, జి.వి. ప్రకాష్ కుమార్ ఉత్తమ నేపథ్య సంగీత విభాగంలోనూ అవార్డులు సాధించారు.
‘మహారాజా’ చిత్రం సాధించిన విజయాలను కూడా అధికారిక ప్రకటనలో ప్రత్యేకంగా ప్రస్తావించారు; ఈ చిత్రానికి గాను అనల్ అరసు ఉత్తమ స్టంట్ కొరియోగ్రఫీ అవార్డును, సచన నమిదాస్ ఉత్తమ సహాయ నటి పురస్కారాన్ని గెలుచుకున్నారు. రాష్ట్రం నుండి అవార్డులు పొందిన వారిలో ‘మెయ్యజగన్’ చిత్రానికి ఆడియోగ్రఫీ విభాగంలో ప్రత్యేక ప్రస్తావన పొందిన సురేన్ జి, ‘బ్లూ’ అనే లఘు చిత్రానికి ఉత్తమ సౌండ్ డిజైన్ అవార్డు గెలుచుకున్న టి.ఎస్. హరి హరసుధన్ కూడా ఉన్నారు.



















