అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కోవిడ్ పాజిటివ్ నమూనాల జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షల్లో ఒమిక్రాన్ ఆర్ఎఫ్.5 వేరియంట్ గుర్తించడం జరిగిందన్నారు ఏపీ ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్. ఇది కరోనా వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియంట్‌కు చెందిన ఒక ఉపవంశం అని, ప్రపంచ వ్యాప్తంగా గుర్తించిన అనేక ఒమిక్రాన్ ఉపవంశాల్లో RF.5 కూడా ఒకటి అని, కడప జిల్లాలో నమోదైన కోవిడ్ పాజిటివ్ కేసుల్లో 4 నమూనాలను వైద్య ఆరోగ్య శాఖ పూణేలోని వైరాలజీ ల్యాబ్ కు పంపిందన్నారు. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సెల్ ఫోన్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా అధికారులతో పూణే నుంచి అందిన ఫలితాలు, రాష్ట్రంలోని తాజా పరిస్థితుల గురించి మంత్రి చర్చించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వేరియంట్‌ను సాధారణ జీనోమిక్ పర్యవేక్షణలో భాగంగా పరిశీలిస్తోందన్నారు. ఓమిక్రాన్ RF-5nu SARS-Coc2 గా కూడా పర్యవేక్షిస్తోoదని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ తెలిపారు. సింగపూర్‌తో పాటు ఆగ్నేయాసియా లోని కొన్ని దేశాల్లో RF.5 కేసులు ఎక్కువగా నమోదయ్యాయని పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న శాస్త్రీయ ఆధారాల ప్రకారం RF.5 ఇతర ఒమిక్రాన్ వేరియంట్లతో పోలిస్తే ప్రమాదకరమని ఎలాంటి ఆధారాలు లేవన్నారు. అందువల్ల ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ విష్ణువర్ధన్ తెలిపారు.


















