అమరావతి : సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా అభివృద్ధిని, సంక్షేమాన్ని పరుగులు పెట్టిస్తోందని మంత్రి సవిత తెలిపారు. దీనిలో ఈ భాగంగా ఈ నెల 22వ తేదీన తల్లికి వందనం నిధులు జమ చేయనున్నట్లు ప్రకటించారు. ఇంటిలో ఎందరు చదువుకున్న బిడ్డలుంటే, అందరికీ తల్లికి వందనం అమలు చేస్తున్నామన్నారు. రొద్దం పెద్ద చెరువు అభివృద్దికి రూ.3.50 కోట్లు మంజూరయ్యాయని చెప్పారు. పెనుకొండ నియోజక వర్గంలో అయిదు అంగన్‌వాడీ కేంద్రాలకు భవనాలు మంజూరయ్యారన్నారు. సీఎస్ఆర్ ఫండ్స్ తో ఈ భవనాలను నిర్మించనున్నామన్నారు ఎస్. సవిత. అంతకు ముందు రొద్దం మండల కేంద్రంలో పీహెచ్సీ భవన నిర్మాణ పనుల ప్రారంభానికి విచ్చేసిన మంత్రి సవితకు, ఇతర ప్రజా ప్రతినిధులకు కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు ఘన స్వాగతం పలికారు.
ఇదిలా ఉండగా శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ సమీపంలో ఏర్పాటు చేసిన కియా కార్ల పరిశ్రమతో వేలాది మందికి ఉపాధి లభిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. ఎంతో శ్రమ కోర్చి కియా పరిశ్రమను సీఎం చంద్రబాబు తీసుకొచ్చారన్నారు. నూతన పరిశ్రమలు ఏర్పాటు చేయలేని అసమర్థ జగన్ కియా పరిశ్రమను వెళ్లగొడతానని కుట్ర పన్నారన్నారు. కాని, ఆయన వల్ల కాలేదన్నారు. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా, యువతకు ఉపాధి కల్పించాలని పేర్కొన్నారు, పారిశ్రామికంగా రాష్ట్రాన్ని నిలబెట్టాలని సీఎం చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకు రావడానికి కృషి చేస్తున్నారని మంత్రి సవిత కొనియాడారు.


















