Venkaiah Naidu Shocking Comments : ఈ దేశ భ‌విత‌వ్యం మీ చేతుల్లోనే ఉంది – వెంక‌య్య

ప‌ద‌వీ విర‌మ‌ణ చేశా కానీ పెద‌వి విర‌మ‌ణ చేయ‌లేదు

Hello Telugu - Venkaiah Naidu Shocking Comments

Hello Telugu - Venkaiah Naidu Shocking Comments

Venkaiah Naidu : కృష్ణా జిల్లా – ఈ దేశ భ‌విష్య‌త్తు యువ‌తీ యువ‌కుల‌పై ఉంద‌న్నారు మాజీ దేశ ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు (Venkaiah Naidu). గురువారం కృష్ణా జిల్లాలోని తేలప్రోలు ఉషారామ ఇంజనీరింగ్ కళాశాల లో గ్రాడ్యుయేషన్ కార్యక్రమం జ‌రిగింది. ముఖ్య అతిధిగా హాజరై ప్ర‌సంగించారు. కళాశాలలు, యూనివర్శిటీ లకు వెళ్లి ప్రసంగించే కార్యక్రమాలు పెట్టుకున్నాన‌ని చెప్పారు. నేను పదవీ విరమణ చేశాను కానీ.. పెదవీ విరమణ చేయ లేద‌న్నారు . దేశ భవిష్యత్తు గురించి నేటి తరానికి‌ చెప్పాలనేదే నా సంకల్పం అని స్ప‌ష్టం చేశారు. డిగ్రీ పట్టాలు అందుకున్న ఈరోజు జీవితం లో మరచి పోలేని రోజు అన్నారు. ప్రపంచంలో నేడు మన దేశం వేగవంతంగా అభివృద్ధి చెందుతోంద‌న్నారు.

Venkaiah Naidu Shocking Comments

ప్రపంచ ఆర్ధిక అభివృద్ధి లో నాలుగో స్థానంలో ఉన్నామ‌న్నారు. త్వరలోనే మూడో స్థానానికి చేరుతామ‌న్నారు. కొన్ని అగ్ర దేశాల బెదిరింపులు కు మనం భయపడేది లేదన్నారు వెంక‌య్య నాయుడు (Venkaiah Naidu). మన‌ పంచభూతాలను మనం గౌరవిస్తే.. అవి మనల్ని కాపాడతాయన్నారు. మన తెలివిని దోచుకుని.. వారి గురించి గొప్పగా బ్రిటిష్ వారు చెప్పుకున్నారంటూ ఎద్దేవా చేశారు. స్వ‌తంత్రం వచ్చాక మన తెలివి తేటలతో మనం సొంతంగా ఎదిగామ‌న్నారు. నేటి తరం అంతా మన దేశ అభివృద్ధి లో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. భారతదేశం ఎప్పుడూ ఏదేశం మీద దండయాత్ర చేయ లేద‌న్నారు . మన మూలాలు దెబ్బ తీయడానికి గతంలో చాలా కుట్ర లు చేశారన్నారు.

నేడు మనకు ఎన్ని అవకాశాలు ఉన్నాయో… అన్ని సవాళ్లు కూడా ఎదురవుతున్నాయ‌ని అన్నారు. ప్రతి పాఠశాల, కళాశాలల్లో విద్యార్థులు కు ఐక్యత తో ఉండేలా చూడాలన్నారు. కుల, మత, ప్రాంత బేధాలు ఉండ కూడదన్నారు. విద్యార్థులకు సంస్కారం తో ఉండేలా అలవాటు చేయాలన్నారు. విద్యాలయం, గ్రంధాలయం, సేవాలయం ఉండేలా చూడాలన్నారు. కన్నతల్లిని, పుట్టిన ఊరుని, పాఠాలు చెప్పిన ఉపాధ్యాయులను ఎప్పటికీ మరువ కూడ‌ద‌న్నారు. ఎంత ఉన్నత స్థానానికి‌ వెళ్లినా నీ ఊరును మరచిపోకు అన్నారు. నీకంటే ఆర్ధికంగా బలహీనంగా ఉన్న వారిని చేతనైనంతలో చేయూత ను ఇవ్వాల‌న్నారు.

Also Read : Rahul Gandhi Shocking Comment : కేంద్ర ఎన్నిక‌ల సంఘం మోసం నిజం – రాహుల్

Exit mobile version