Rahul Gandhi Shocking Comment : కేంద్ర ఎన్నిక‌ల సంఘం మోసం నిజం – రాహుల్

బీహార్ లో ఓట్ల తొల‌గింపుపై ఈ సీ మౌన‌మేల‌..?

Hello Telugu - Rahul Gandhi Shocking Comment

Hello Telugu - Rahul Gandhi Shocking Comment

Rahul Gandhi : ఢిల్లీ – కేంద్ర ఎన్నిక‌ల సంఘంపై సీరియ‌స్ అయ్యారు ఎంపీ రాహుల్ గాంధీ. ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న చోట కూడా బీజేపీకే అనుకూలంగా ఫలితాలు ఎలా వ‌స్తాయ‌న్నారు. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ కు పూర్తి భిన్నంగా ఫలితాలు వస్తుండ‌డం ప‌ట్ల అనుమానం వ్య‌క్తం చేశారు. ఇటీవల జరిగిన రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై అధ్యయనం చేశామ‌న్నారు. హర్యానా, మధ్యప్రదేశ్లోనూ అంచనాలకు భిన్నంగా ఫలితాలు వచ్చాయన్నారు. బీహార్లో లక్షల మంది ఓట్లను తొలగించారని, దీనిపై ఈసీ స‌మాధానం చెప్పాల‌న్నారు. ఈసీ ఎలా మోసానికి పాల్ప‌డుతుందో ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ ద్వారా వివ‌రించారు. ఎన్నికల సంఘం కొరియోగ్రాఫ్ చేసిన షెడ్యూల్ అనుమానాన్ని మరింత పెంచిందని అన్నారు.

Rahul Gandhi Key Comments on Election Commission

రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈరోజు ఆరోపించిన ఎన్నికల అక్రమాలపై దర్యాప్తు ఫలితాలను పంచుకోవ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఈ సంద‌ర్బంగా ఆయ‌న సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో కర్ణాటక అసెంబ్లీ సెగ్మెంట్‌లో భారీ ఓటర్ల మోసం జరిగిందని కాంగ్రెస్ దర్యాప్తులో తేలింద‌న్నారు. ఎన్నికల సంఘం అధికార బిజెపితో కుమ్మక్కైందని షాకింగ్ కామెంట్స్ చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో బలమైన ప్రదర్శన తర్వాత కొన్ని నెలలకే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో భారత కూటమి ఓట‌మి చెంద‌డం వెనుక ఎన్నో అనుమానాలు దాగి ఉన్నాయ‌న్నారు. గత ఏడాది లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రలోని 48 స్థానాల్లో 30 స్థానాలను గెలుచుకున్న ఇండియా బ్లాక్, కేవలం ఐదు నెలల తర్వాత జరిగిన రాష్ట్ర ఎన్నికల్లో 50 మార్కును కూడా దాటలేక పోయింద‌న్నారు.

Also Read : Ex MLA Kethireddy Fired on CM : బీటెక్ ర‌వి భార్య కాదు చంద్ర‌బాబే పోటీ

Exit mobile version