Popular Leader Venkaiah Naidu : హ‌స్తిన‌లో వెంక‌య్య నాయుడు బిజీ

మ‌రోసారి రాజ‌కీయ పునః ప్ర‌వేశం

Hello Telugu - Popular Leader Venkaiah Naidu

Hello Telugu - Popular Leader Venkaiah Naidu

Venkaiah Naidu : ఢిల్లీ – మాజీ ఉప రాష్ట్ర‌ప‌తి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు (Venkaiah Naidu) హాట్ టాపిక్ గా మారారు. ఆయ‌న దేశ రాజ‌ధాని ఢిల్లీలో బిజీగా ఉన్నారు. బీజేపీలో త‌ను ట్రబుల్ షూట‌ర్ గా పేరు పొందారు. అయితే ఆయ‌న అనూహ్యంగా ఉప రాష్ట్ర‌ప‌తి త‌ర్వాత మెయిన్ స్ట్రీమ్ రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. అంద‌రూ రాష్ట్ర‌ప‌తికి ప్ర‌మోట్ చేస్తార‌ని భావించారు. కానీ మోదీ ప‌రివారం త‌న‌ను తెలివిగా త‌ప్పించింద‌ని ఆరోప‌ణ‌లు వున్నాయి. తాజాగా బీజేపీలో కీల‌క ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. ఉప రాష్ట్ర‌ప‌తిగా ఉన్న జ‌గ‌దీప్ ధ‌న్ ఖ‌ర్ అనూహ్యంగా ప‌ద‌వి నుంచి త‌ప్పుకున్నారు. రాజీనామా చేయ‌డంతో ఈ స్థానం ఖాళీ ఏర్ప‌డింది. ఇప్ప‌టికే ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ రిలీజ్ చేసింది.

Venkaiah Naidu in Delhi

ఆర్ఎస్ఎస్ ముఖ్య‌లతో వెంక‌య్య నాయుడు చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం , మోదీతో భేటీ కావ‌డం త‌ను తిరిగి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌లోకి రానున్నారా అన్న అనుమానం క‌లుగుతోంది ఆ పార్టీ వ‌ర్గాల‌లో. కేంద్రంలో మారుతున్న గణాంకాలతో, వెంకయ్య నాయుడు ఎంట్రీ ఇచ్చారనే ప్రచారం జోరందుకుంది. తిరిగి ఉప రాష్ట్ర‌ప‌తి బ‌రిలో ఉంటారా లేక బీజేపీ జాతీయ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రిస్తారా అన్న‌ది ఉత్కంఠ నెల‌కొంది కాషాయ శ్రేణుల‌లో. ఇక వెంక‌య్య నాయుడి ప్ర‌స్థానం మొద‌ట ఆర్ఎస్ఎస్ నుంచి మొద‌లైంది. చివ‌ర‌కు ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వితో ముగిసింది. ఆర్ఎస్ఎస్ ముఖ్యుల‌తో వెంక‌య్య గంట‌కు పైగా చ‌ర్చ‌లు జ‌రిపారు. ఆయ‌న సేవ‌ల‌ను వినియోగించు కోవాల‌ని అనుకుంటున్న‌ట్లు స్పష్టం చేసిన‌ట్లు స‌మాచారం.

Also Read : Trump Shocking to Russia : రష్యాకు చమురు ఆంక్షలు పెద్ద దెబ్బ : ట్రంప్

Exit mobile version