Trump : అమెరికా – అమరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు రష్యాను ఉద్దేశించి. భారతదేశంపై తాము విధించిన సుంకం రష్యాకు కోలుకోలేని షాక్ ఇవ్వక తప్పదన్నారు. ట్రంప్ (Trump) మీడియాతో మాట్లాడారు. దీని వలన ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించాలని కోరుకునే అవకాశం ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కు కలిగిందని అభిప్రాయపడ్డారు.
Trump Shocking to Russia
యుద్ధం కారణంగా రష్యా ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే దిగజారి పోయి ఉందన్నారు. ఆ దేశం నుంచి నిరంతరం చమురు అత్యధికంగా కొనుగోలు చేస్తున్న ఇండియాపై 50 శాతం సుంకం షాక్ ఇవ్వనుందన్నారు. నేను దానికంటే చాలా పెద్ద పనులు చేయడానికి సిద్ధంగా ఉన్నాను, కానీ వారు కలవాలనుకుంటున్న కాల్ నాకు వచ్చింది అంటూ చమత్కరించారు. కాగా ట్రంప్ తన వాణిజ్య యుద్ధంలో గతంలో నిర్ణయించిన 25 శాతం సుంకానికి అదనంగా రష్యా చమురును కొనుగోలు చేసినందుకు గత వారం భారతదేశంపై 25 శాతం శిక్షాత్మక సుంకాన్ని విధించారు.
జనవరిలో అధికారం చేపట్టినప్పటి నుండి ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు ట్రంప్ అలాస్కాలో పుతిన్‌ను కలవనున్నారు.యుద్ధ విరమణలో వారు ఏమి చూడాలనుకుంటున్నారో నేను చూడబోతున్నాను. రెండు దేశాలకు నేను సూచించేది ఒక్కటే ఉత్తమ ఒప్పందం కుదుర్చు కోవాలని నేను కోరుకుంటున్నాను అని ట్రంప్ అన్నారు. చివరికి పుతిన్ , ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ఒకరితో ఒకరు నేరుగా మాట్లాడు కోవాలని తాను కోరుకుంటున్నానని స్పష్టం చేశారు.
నేరాలతో సతమతమవుతున్న రాజధాని శాంతి భద్రతలను సమాఖ్య నియంత్రణలోకి తీసుకు రావడానికి కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకం చేసిన తర్వాత వైట్ హౌస్ వద్ద ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్, భారత్ తో సహా ఐదు యుద్దాలను తాను ఆపానని మరోసారి ప్రకటించారు ట్రంప్.
Also Read : AP Mega DSC Results Sensational : ఏపీ మెగా డీఎస్సీ పరీక్షా ఫలితాలు విడుదల
