Trade Tensions : అమెరికా-భారత్ (India) మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు, రూపాయి బలహీనత, నిరుత్సాహకరమైన కార్పొరేట్ ఫలితాలు దేశీయ ఈక్విటీ మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) తమ పెట్టుబడులను కొనసాగించేందుకు ఆసక్తి చూపకుండా, భారీగా నిధులు వెనక్కి తీసుకుంటున్నారు.
Trade Tensions Sensational
2025 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ ఎఫ్‌పీఐలు రూ.1.13 లక్షల కోట్ల మేర నిధులను ఉపసంహరించారు. ఆగస్టు నెలలో కేవలం ఆరు ట్రేడింగ్ సెషన్లలోనే రూ.18,000 కోట్లకు పైగా ఈక్విటీ అమ్మకాలు జరిపారు. డిపాజిటరీల వద్ద లభ్యమైన సమాచారం ప్రకారం, జూలై నెలలో రూ.17,741 కోట్లు, ఆగస్టు 8వ తేదీ నాటికి రూ.17,924 కోట్లు నికరంగా ఉపసంహరించారు. ఇదివరకే మార్చి నుంచి జూన్ మధ్యకాలంలో వారు రూ.38,673 కోట్లు దేశీ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేశారు.
ఈ విషయంపై ఏంజెల్‌వన్ సీనియర్ ఫండమెంటల్ అనలిస్ట్ వకర్ జావేద్ ఖాన్ మాట్లాడుతూ, ‘‘ప్రస్తుతం ఎఫ్‌పీఐలు అత్యంత రిస్క్-అవర్సివ్ మూడ్‌లో ఉన్నారు. అమెరికా (America) రెండు విడతలుగా భారత ఉత్పత్తులపై 50 శాతం వరకు సుంకాలు విధించడమే విదేశీ పెట్టుబడిదారుల మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపింది,’’ అని అన్నారు.
అలాగే, అమెరికన్ ట్రెజరీ రాబడుల పెరుగుదల కూడా విదేశీ ఇన్వెస్టర్లను అక్కడి మార్కెట్లవైపు ఆకర్షిస్తున్నదని ఖాన్ వివరించారు.
మార్కెట్ పరిస్థితులపై ‘భారత్ పే’ అప్రమత్తత
ఈ తరుణంలో ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ భారత్ పే తన పబ్లిక్ ఇష్యూ (ఐపిఓ) పై నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకుంది. కంపెనీ సీఈఓ నళిన్ నేగి తెలిపిన ప్రకారం, మార్కెట్ పరిస్థితులు చక్కబడిన తర్వాతే లిస్టింగ్ పై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈలోగా సంస్థ అవసరమైన నిధులను ఇతర మార్గాల్లో సమీకరించాలనుకుంటోంది. ‘‘మేము నిర్దేశించుకున్న వ్యాపార లక్ష్యాలను ముందుగానే సాధించగలిగాం,’’ అని నేగి వెల్లడించారు.
పబ్లిక్ ఇష్యూల వేళ
ఆగస్టు 19వ తేదీన, షిప్పింగ్, లాజిస్టిక్ సేవలు అందించే శ్రీజి షిప్పింగ్ గ్లోబల్, మరియు రిటైల్ సంస్థ పటేల్ రిటైల్ తమ పబ్లిక్ ఇష్యూలను ప్రారంభించనున్నాయి. ఈ ఇష్యూలు 21వ తేదీన ముగియనున్నాయి. షేర్ల ధర శ్రేణిని కంపెనీలు సోమవారం ప్రకటించనున్నాయి.
2025లో ఇప్పటివరకు 44 పబ్లిక్ ఇష్యూలు దేశీయ మార్కెట్‌ను చేరాయి. ఈ వారంలో బ్లూస్టోన్ జువెలరీ, లైఫ్‌స్టైల్, రీగల్ రీసోర్సెస్ (ఆగ్రో ఆధారిత సంస్థ) వంటి కంపెనీలు తమ షేర్ ఇష్యూలను ప్రారంభించనున్నాయి.
Also Read : RBI New Innovation : వారి డబ్బును తీసుకోవడానికి ఇకపై సులభం
