Popular Actress Urvashi : జాతీయ అవార్డుపై ఊర్వ‌శి షాకింగ్ కామెంట్స్

ఏ ప్రాతిప‌దిక‌న ఎంపిక చేశారో తెలియ‌దు

Hello Telugu - Popular Actress Urvashi Shocking Comments on National Awards

Hello Telugu - Popular Actress Urvashi Shocking Comments on National Awards

Urvashi : ప్ర‌ముఖ న‌టి ఊర్వశి కీల‌క వ్యాఖ్య‌లు చేయ‌డం ప్రాధాన్య‌త సంత‌రించుకుంది. ఇటీవ‌లే 71వ జాతీయ చల‌న చిత్ర అవార్డుల‌ను కేంద్రం ప్ర‌క‌టించింది. ఈ సంద‌ర్బంగా న‌టి ఊర్వ‌శిని స‌పోర్ట్ యాక్ట‌ర్ గా అవార్డుకు ఎంపిక చేసింది. కొంత గ్యాప్ త‌ర్వాత త‌ను స్పందించ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ సంద‌ర్బంగా ఇది నిశ్శబ్దంగా అంగీకరించాల్సిన పెన్షన్ డబ్బు కాదు అంటూ పేర్కొంది న‌టి ఊర్వ‌శి (Urvashi Rautela). సపోర్టింగ్ కేటగిరీలో తనకు అవార్డు ఇచ్చినందుకు ఊర్వశి 71వ జాతీయ చలనచిత్ర అవార్డు జ్యూరీని ప్రశంసించింది. తన కెరీర్‌లో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇదే మొదటిసారి కాదని ఊర్వశి పేర్కొంది.

Actress Urvashi Shocking Comments on National Awards

2024లో విడుదలైన క్రిస్టో టామీ చిత్రం ఉల్లోజుక్కులో లీలమ్మ పాత్ర‌ను పోషించింది న‌టి ఊర్వ‌శి. ఈ పాత్ర‌కు ప్రేక్ష‌కుల నుంచి పెద్ద ఎత్తున ప్ర‌శంస‌లు ల‌భించాయి. దీంతో స‌హాయ పాత్ర‌కు గాను ఉత్త‌మ కేట‌గిరి కింద ఊర్వ‌శిని ఎంపిక చేయ‌డం ప‌ట్ల కూడా స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మైంది. ఈ చిత్రంలో పార్వతి తిరువోతు కూడా ప్రధాన పాత్రలో నటించింది. త‌ను ఓ మీడియాతో మాట్లాడారు ఊర్వ‌శి. త‌న‌ను గుర్తించినందుకు, అవార్డు ప్ర‌క‌టించినందుకు ధ‌న్య‌వాదాలు తెలియ చేస్తున్నాన‌ని తెలిపింది. పాత్ర‌ను ఎలా వ‌ర్గీక‌రించార‌నే దానిపై కూడా ప‌లు ప్ర‌శ్న‌లు సంధించ‌డం విస్తు పోయేలా చేసింది సినీ ఇండ‌స్ట్రీని.

అయితే త‌న‌తో పాటు పార్వ‌తి ఇద్ద‌రూ ఉత్త‌మ న‌టిగా పోటీ ప‌డుతున్నప్పుడు త‌న‌ను స‌పోర్టింగ్ కేట‌గిరీలో ఎందుకు చేర్చారో అర్థం కాలేద‌న్నారు. నటనకు ఏదైనా ప్రామాణిక స్థాయి ఉందా? లేదా ఒక నిర్దిష్ట వయస్సు తర్వాత, మీకు లభించేది ఇదేనా అని ప్ర‌శ్నించింది.

Also Read : Hero Dhanush – Mrunal Thakur : ధ‌నుష్ తో మృణాల్ ఠాకూర్ డేటింగ్..?

Exit mobile version