చెన్నై : దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్, సన్ రైజర్స్ జట్టు యజమాని కావ్య మారన్. ఈ ఇద్దరూ ఇటీవలే గ్రీస్ నగరంలో ప్రముఖల సమక్షంలో ఒక్కటయ్యారు. తాజాగా చెన్నైలో అంగరంగ వైభవోపేతంగా వీరి రిసెప్షన్ జరిగింది. ఈ కార్యక్రమానికి దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇదిలా ఉండగా అనిరుధ్ రవిచందర్, కావ్య మారన్ లకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. అదేమిటంటే వారి హానీమున్ ట్రిప్ గురించి. సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చలు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా చెన్నైలో అంగరంగ వైభవంగా జరిగిన వివాహ రిసెప్షన్ అనంతరం నూతన దంపతులు కావ్య మారన్, అనిరుధ్ రవిచందర్ లగ్జరీ హనీమూన్ ట్రిప్‌కు పయనమైనట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సన్ గ్రూప్ ఛైర్మన్ కళానిధి మారన్‌కు చెందిన అత్యంత విలాసవంతమైన ప్రైవేట్ జెట్ ‘VT-SRH’లో ఈ జంట ప్రయాణిస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది.
గ్రీస్‌లో అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా వివాహ వేడుకలను జరుపుకున్న ఈ జంట, ఇప్పుడు తమ హై-ప్రొఫైల్ ట్రావెల్ ప్లాన్స్‌తో మరోసారి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. భారతదేశంలోని అగ్రశ్రేణి సంగీత దర్శకుల్లో ఒకరిగా భారీ క్రేజ్ ఉన్న అనిరుధ్, దేశంలోని ప్రముఖ వ్యాపార కుటుంబానికి చెందిన కావ్య మారన్‌తో కలిసి కొత్త జీవితంలోకి అడుగు పెట్టడం సినీ, వ్యాపార వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. వీరి హనీమూన్ వేదిక, ప్రయాణ ఏర్పాట్లు అత్యంత విలాసవంతంగా ఉన్నాయంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే ఈ ప్రైవేట్ జెట్ ప్రయాణం, హనీమూన్ వివరాలపై మారన్ కుటుంబం నుంచీ గానీ, నూతన దంపతుల నుంచీ గానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ధృవీకరణ రాలేదు. అధికారిక ప్రకటన లేకపోయినప్పటికీ, వీరి రాయల్ హనీమూన్ ట్రిప్‌కు సంబంధించిన వార్తలు నెట్టింట తెగ వైరల్ అవుతూ హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నాయి.
