‘ఆలోచన’ చిత్రం అద్భుతం ప్ర‌శంస‌నీయం

మంచి సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తారు

hellotelugu-Chiranjeevi

హైద‌రాబాద్ : మెగాస్టార్ చిరంజీవి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. పీఎస్‌జే ఫిల్మ్స్ కో బ్యానర్ మీద ప్రదీప్ కుమార్, గుండబోయిన శ్రీనివాస్ నిర్మాణంలో సురేందర్ చాచా తెరకెక్కించిన చిత్రం ‘ఆలోచన’. ఈ మూవీలో జీవీ.నారాయణ రావు, ప్రసాద్ బాబు, నరసింహరాజు, మహర్షి రాఘవ, జయలలిత, రజన్ హరి, బెన్నీ సుధాకర్ వంటి వారు కీలక పాత్రలు పోషిచారు. వీరితో పాటు సుజనా,అనుపమ స్వాతి, మాధవి, అద్వైక జెస్సీ, హసిత, జెన్నీ,ప్రసాద్ రామ్, నరేంద్ర, ముఖ్య పాత్రల్లో నటించారు. నవంబర్ 27న ‘ఆలోచన’ మూవీని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘స్నేహం కోసమే అన్నీ.. స్నేహంతోనే అన్నీ.. ఆశ, మోహం, అసూయ, స్వార్థం అన్నీ చచ్చి.. నీలోని మనిషి.. ప్రతీ మనిషిని ప్రేమిస్తే చాలు.. ప్రతీ ఒక్కరూ నిన్ను ప్రేమిస్తారు.. ఆ ప్రేమలో ప్రతీ క్షణం ఆనందంగా జీవిస్తావు.. నువ్వు తృప్తిగా మరణించడానికి మార్గం మానవత్వం.. అదే దైవం, అదే మోక్షం’ అని ఈ మూవీ చెప్పే ప్ర‌య‌త్నం చేస్తుంది.

‘ప్రాణ స్నేహితులు చచ్చిపోతే.. వాడితో పాటు చచ్చిపోయే స్నేహితుడు చరిత్రలో ఉన్నాడా?’, ‘అద్భుతాలను అనుభవించాలి.. ప్రశ్నించకూడదు.. సమాధానం దొరకదు.. ఉండదు’.. అనే అద్భుతమైన డైలాగ్స్, గుండెని తాకే ఎమోషన్స్‌తో, మనసుని కదిలించే సన్నివేశాలతో ట్రైలర్ అందరిలోనూ ‘ఆలోచన’ను రేకెత్తించేలా సాగింది. ట్రైలర్ రిలీజ్ చేసిన అనంతరం.. మెగాస్టార్ చిరంజీవి మాట్లాడారు. మంచు పల్లకి’ స్పూర్తితో ‘ఆలోచన’ చేశామని అన్నారు. ఈ ‘ఆలోచన’ చిత్రం నిజంగానే మంచి ఆలోచన. వృద్దాప్యంలోనూ తల్లిదండ్రులు తమ బిడ్డల గురించే ఆలోచిస్తుంటారు. కానీ బిడ్డలకు మాత్రం వేరే వేరే ప్రపంచాలుంటాయి. వృద్దాప్యంలో తమ తమ స్నేహితులతో కలిసి ఉండటం, ఆలోచనలు పంచుకోవడం, సమయాన్ని గడపడంతో మళ్లీ ఏజ్ రివర్స్ అయినట్టుగా వారికి అనిపిస్తుంది. అలాంటి ఆలోచనను రేకెత్తించేలా ఈ ‘ఆలోచన’ ఉందంటూ ప్ర‌శంస‌లు కురిపించారు. మంచి చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటార‌ని అన్నారు. అలానే ఈ సినిమాని ఆదరించాలని, ‘ఆలోచన’ చిత్రం మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అన్నారు మెగాస్టార్.

Exit mobile version