ఆకాశమంత విజ‌యం ద‌క్కింది : అల్లు అర‌వింద్

‘ఆకాశంలో ఒక తార’ స‌క్సెస్ మీట్ లో నిర్మాత

hellotelugu-AkaashamloOKaTaraSuccessMeet

హైద‌రాబాద్ : దుల్క‌ర్ స‌ల్మాన్ కీ రోల్ పోషించిన చిత్రం ఆకాశంలో ఒక తార‌. న‌వంబ‌ర్ 20న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన ఈ మూవీ తొలి షో నుంచే పాజిటివ్ టాక్ ను తెచ్చుకుంది. ఆశించిన దానికంటే బిగ్ స‌క్సెస్ రావ‌డంతో చిత్ర బృందం స‌క్సెస్ మీట్ నిర్వ‌హించింది . ఈ సందర్భంగా అల్లు అరవింద్, దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి , పవన్ సాదినేనిలతో కూడిన చిత్ర బృందం ఒక ప్రెస్ మీట్ నిర్వహించింది. తమ ఆనందాన్ని పంచుకున్నారు. ‘ఆకాశంలో ఒక తార’ చిత్రానికి ప్రేక్షకుల నుండి, విమర్శకుల నుండి సానుకూల స్పందన లభించింది. ఈ చిత్ర నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. ప్రేక్షకుల నుండి ఇంతటి అద్భుతమైన స్పందన రావడం మాకు నిజంగా ఆశ్చర్యాన్ని, సంతోషాన్ని కలిగించింది అని పేర్కొన్నారు. దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో, శృతి హాసన్ ,రుహాని శర్మ కీలక పాత్రలు పోషించారు.

పవన్ సాదినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా , లైట్‌బాక్స్ మీడియా బ్యానర్లపై ఈ చిత్రం శుక్ర‌వారం విడుదలైంది. ప్రేక్షకుల నుండి, మీడియా నుండి మాకు గొప్ప స్పందన లభించింది. దుల్కర్ సల్మాన్ ఈ చిత్రంలో అద్భుతమైన నటనను ప్రదర్శించారు. సాత్విక ఈ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు; ఆమె మా బ్యానర్‌లో మరో రెండు చిత్రాల్లో నటించనున్నారు, అందులో ఒకటి నాగ చైతన్యతో ఉంటుంది అని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు అల్లు అర‌వింద్. దర్శకుడు పవన్ సాదినేని కథను చాలా చక్కగా రాశారని అభినందించారు. ఆయనతో తన తదుపరి చిత్రాన్ని కూడా చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే, స్క్రిప్ట్ అందించిన రచయిత గున్నం గంగరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. చిత్ర ద్వితీయార్థంలో శృతి హాసన్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారన ప్రశంసించారు. దర్శకుడు పవన్ సాదినేని నటీనటులకు, నిర్మాతలకు, సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు తెలిపారు. నిర్మాత అశ్విని దత్ ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version