Hero Dhanush – Mrunal Thakur : ధ‌నుష్ తో మృణాల్ ఠాకూర్ డేటింగ్..?

కీల‌క వ్యాఖ్య‌లు చేసిన స్టార్ హీరోయిన్

Hello Telugu - Hero Dhanush - Mrunal Thakur

Hello Telugu - Hero Dhanush - Mrunal Thakur

Dhanush : సీతారామం మూవీతో ఒక్క‌సారిగా లైమ్ లైట్ లోకి వ‌చ్చింది న‌టి మృణాల్ ఠాకూర్. ఆ త‌ర్వాత ప‌లు సినిమాల‌లో న‌టించింది. త‌న అందాల‌ను ఆర‌బోసింది కూడా. నిత్యం సోష‌ల్ మీడియాలో త‌న ఫోటోల‌తో హ‌ల్ చ‌ల్ చేస్తూ వ‌స్తోంది. తాజాగా త‌న‌కు సంబంధించి పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది. త‌ను డేటింగ్ లో ఉంద‌ని , ప్ర‌త్యేకించి త‌మిళ చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన టాప్ హీరో ధ‌నుష్ తో ప్రేమాయ‌ణం గుట్టుగా న‌డుపుతోంద‌ని . అంతే కాదు ఇద్ద‌రూ క‌లిసి ర‌హ‌స్యంగా ప‌లు ప్రాంతాల‌లో ప‌ర్య‌టించార‌ని కూడా టాక్. ఇది ప‌క్క‌న పెడితే తామిద్ద‌రి గురించి వ‌స్తున్న ప్ర‌చారం, ఫోటోలపై తాజాగా స్పందించింది ఈ ముద్దుగుమ్మ‌. తాజాగా త‌న మ‌న‌సులో మాట బ‌య‌ట పెట్టేసింది మృణాల్ ఠాకూర్.

Hero Dhanush – Mrunal Thakur Shocking Update

ఈ కామెంట్స్ కు ఆజ్యం పోసింది ఓ కార్య‌క్ర‌మం. అదేమిటంటే ధ‌నుష్ పుట్టిన రోజు సంద‌ర్బంగా బిగ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి విశిష్ట అతిథిగా హాజ‌రైంది న‌టి. అంతే కాకుండా స‌న్ ఆఫ్ స‌ర్దార్ 2 ప్ర‌త్యేక ప్ర‌ద‌ర్శ‌న‌లో కూడా ధ‌నుష్ తో క‌నిపించింది. డేటింగ్ లో ఉన్నారా అన్న ప్ర‌శ్న‌కు ఎలాంటి స‌మాధానం ఇవ్వ‌కుండానే న‌వ్వేసింది మృణాల్ ఠాకూర్. అయితే ఇదే సంద‌ర్భంలో త‌ను కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. త‌న‌ముందు సినీ కెరీర్ ఉంద‌న్నారు. కొన్ని మంచి పాత్ర‌లు దొరికితే చేసేందుకు సిద్దంగా ఉన్నాన‌ని తెలిపారు. నేను బ‌య‌టి వాటిని న‌మ్మ‌ను. ఈ ప్ర‌చారం కూడా ఎలా వ‌చ్చిందో తెలియ‌దు. నా జీవితంలో జరుగుతున్న విషయాల గురించి నిరంతరం ఆలోచించడం , మాట్లాడటం నాకు ఇష్టం లేదని స్ప‌ష్టం చేసింది.

Also Read : Hero Vijay Deverakonda : బెట్టింగ్ యాప్ కేసులో విచార‌ణ‌కు దేవ‌ర‌కొండ

Exit mobile version