TTD : తిరుమల – అస్సాంలోని గౌహతిలో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం అయిదు ఎకరాలు ఇవ్వాలని కోరుతూ టీటీడీ (TTD) చైర్మన్ బీఆర్ నాయుడు ముఖ్యమంత్రి హిమంత బిస్వ శర్మను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా శ్రీవారి ప్రసాదాన్ని సీఎంకు అందజేశారు. ఈ మేరకు స్పందించిన ముఖ్యమంత్రి ఐదు ఎకరాల స్థలాన్ని కేటాయిస్తామని హామీ ఇచ్చారు. తమ రాష్ట్ర రాజధానిలో స్వామి వారి అద్భుతమైన ఆలయం నిర్మించేందుకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు.
TTD Chairman Meet Assam CM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తాము గౌహతిలో స్వామి వారి ఆలయ నిర్మాణానికి స్థలం కేటాయించవ లసిందిగా కోరామన్నారు చైర్మన్. ఈ సందర్భంగా గౌహతిలో స్వామి వారి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకున్న సీఎం చంద్రబాబు నాయుడుకు, రాష్ట్ర ప్రభుత్వానికి, టీటీడీ పాలక మండలికి అస్సాం సీఎం కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రఖ్యాత కామాఖ్య అమ్మ వారి ఆలయ విశిష్టతను సీఎం వివరించారు.
టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించే ఈ అద్భుతమైన ఆలయం ద్వారా హిందూ మత ధర్మ పరిరక్షణ, హిందూ సాంప్రదాయం, హిందూ భావజాలాన్ని విస్తృతంగా ప్రచారం చేయగలమని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్వామి వారి ఆలయ నిర్మాణం ద్వారా ఈశాన్య భారత ప్రజలకు కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారి సన్నిధిని త్వరగా తీసుకు రావాలని ఆకాంక్షించారు . ఈ కార్యక్రమం విజయవంతం కావడంలో అఖిల భారత హిందూ మహాసభ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి ( న్యూడిల్లీ ) ప్రముఖ పాత్ర వహించారు.
Also Read : TTD Warning : తిరుమలలో రీల్స్ చిత్రీకరిస్తే చర్యలు తప్పవు
