IPL Top Sixers Interesting : ఐపీఎల్ లో సిక్స‌ర్ల మొన‌గాళ్లు

రోహిత్, కోహ్లీ, ధోనీ, రైనా, శాంస‌న్

Hello Telugu - IPL Top Sixers Interesting

Hello Telugu - IPL Top Sixers Interesting

IPL : హైద‌రాబాద్ : ప్ర‌పంచ క్రికెట్ రంగంలో అత్య‌ధిక ఆదాయం తో పాటు కోట్లాది మందిని ఆద‌రిస్తున్న ఏకైక మెగా టి20 ఫార్మాట్ ఇండియ‌న్ ప్రిమీయ‌ర్ లీగ్ (IPL) . బీసీసీఐ ఆధ్వ‌ర్యంలో మ‌రోసారి ఐపీఎల్ టోర్నీ నిర్వ‌హించేందుకు రెడీ అయ్యింది వ‌చ్చే ఏడాది కోసం. ఇప్ప‌టికే ఆయా జ‌ట్ల యాజ‌మాన్యాల‌కు లేఖ‌లు కూడా రాసింది. ఆయా జ‌ట్ల‌లో ఎవ‌రిని ఎంచుకున్నారు, ఎవ‌రిని వ‌దులుకుంటున్నారో ఆటగాళ్ల లిస్టు ఇవ్వాల‌ని డెడ్ లైన్ పెట్టింది. ఇక ఈ ఏడాది అత్య‌ధికంగా చ‌ర్చ‌కు వ‌చ్చిన ఏకైక ప్లేయ‌ర్, కేర‌ళ క్రికెట్ స్టార్ , ఇప్ప‌టి వ‌ర‌కు రాజ‌స్థాన్ రాయ‌ల్స్ జ‌ట్టుకు స్కిప్ప‌ర్ గా ఉన్న సంజూ శాంస‌న్. త‌న‌ను వ‌దిలేయాలంటూ కోరాడు ఆర్ఆర్ యాజ‌మాన్యాన్ని. దీనికి ఆ యాజ‌మాన్యం ఒప్పుకుంది.

IPL Top Sixers

సంజూ శాంసన్ పై రూ. 18 కోట్లు ఖ‌ర్చ చేసింది. ఇప్పుడు ఇదే ధ‌ర‌కు చెన్నై సూప‌ర్ కింగ్స్ ముందుకు వ‌చ్చింది. త‌న ఒక్క‌డి కోసం త‌మ జ‌ట్టులో కీల‌క పాత్ర పోషించిన ర‌వీంద్ర జడేజా, సామ్ క‌ర‌ణ్ ను వ‌దులుకుంది. అంటే త‌న‌కు ఉన్న స‌త్తా ఏమిటో తెలిసి వ‌చ్చింది. ఇక ఇప్ప‌టి వ‌ర‌కు ఐపీఎల్ లో టాప్ సిక్స‌ర్ల మొన‌గాళ్లు ఐదుగురు ఆట‌గాళ్లు ఉంటే వారిలో శాంస‌న్ కూడా ఒక‌డు. ఇక సిక్స‌ర్ల మోత మోగించిన ప్లేయ‌ర్ల‌లో నెంబ‌ర్ 1 రోహిత్ శ‌ర్మ ఉన్నాడు. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు 302 సిక్సులు బాదాడు. 2వ స్తానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు త‌ను 264 సిక్సులు కొట్టాడు. 3వ స్థానంలో నిలిచాడు ధోనీ. త‌ను 264 సిక్సులు సాధించాడు. 4వ స్థానంలో ఉన్నాడు సంజూ శాంస‌న్ త‌ను 219 సిక్సులు బాదాడు. 5వ స్థానంలో సురేష్ రైనా త‌ను. 203 సిక్సులు కొట్టాడు.

Also Read : DY CM Bhatti Vikramarka Strong Request : తెలంగాణ‌లో భారీగా పెట్టుబ‌డులు పెట్టండిs

Exit mobile version