DY CM Bhatti Vikramarka Strong Request : తెలంగాణ‌లో భారీగా పెట్టుబ‌డులు పెట్టండి

ర‌ష్యా ప్ర‌తినిధుల‌తో డిప్యూటీ సీఎం భ‌ట్టి విక్ర‌మార్క

Hello Telugu - DY CM Bhatti Vikramarka Strong Request

Hello Telugu - DY CM Bhatti Vikramarka Strong Request

Bhatti Vikramarka : హైద‌రాబాద్ : దేశంలో పెట్టుబ‌డుల‌కు అనువైన ప్ర‌దేశంగా హైద‌రాబాద్ ఉంద‌ని స్ప‌స్టం చేశారు ఉప ముఖ్య‌మంత్రి మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌ (Bhatti Vikramarka). ప్రజా భవన్‌లో గ్లోబల్ ట్రేడ్, టెక్నాలజీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (జీటీటీసీఐ) , వీటీబీ బ్యాంక్ రష్యా ప్రతినిధులతో సమావేశమయ్యారు డిప్యూటీ సీఎం. భారతదేశం , రష్యా దేశాల మ‌ధ్య చారిత్రాత్మక స్నేహాన్ని పునరుద్ఘాటించారు . తెలంగాణలోని కీలక రంగాలైన వ్యవసాయం, విద్యుత్, రక్షణ, సహకార బ్యాంకింగ్, సాంకేతిక రంగాల‌లో పెట్టుబడులను ఆహ్వానించారు భ‌ట్టి విక్ర‌మార్క‌.

DY CM Bhatti Vikramarka Invite Investments

సింగరేణి ద్వారా కీలకమైన ఖనిజ అన్వేషణలో గణనీయమైన పురోగతిని హైలైట్ చేశారు ఈ సంద‌ర్బంగా. వ్యవసాయం, విద్యుత్, ఫార్మా, ఐటీ, మైనింగ్‌లో తెలంగాణకు చ‌చెందిన వివిధ‌ రంగాల నాయకత్వాన్ని ప్రదర్శించారు. హైదరాబాద్ వ్యూహాత్మక ప్రయోజనాలను పంచుకున్నారు. బలమైన పారిశ్రామిక మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ విమానాశ్రయం, అధిక భద్రతా ప్రమాణాలు, నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి విరివిగా ఉంద‌న్నారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌.

తెలంగాణ విజన్ 2047 అనేది ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. దీని ద్వారా మూడు ట్రిలియన్ డాలర్లు సాధించాల‌ని కంక‌ణం క‌ట్టుకుంద‌ని ఈ సంద‌ర్బంగా స్ప‌ష్టం చేశారు మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క‌. ప్రాంతీయ రింగ్ రోడ్, మూసీ నది పునరుజ్జీవనం వంటి ప్రధాన కార్యక్రమాల గురించి ప్రతినిధి బృందానికి వివరించారు. రష్యన్ ఏజెన్సీలతో సన్నిహితంగా పాల్గొనడానికి, విభాగ స్థాయి చర్చల ద్వారా బలమైన భాగస్వామ్యాలను ముందుకు తీసుకెళ్లడానికి ఎదురు చూస్తున్నామని స్ప‌ష్టం చేశారు డిప్యూటీ సీఎం.

Also Read : TG Govt New Innovation for Women Groups : మ‌హిళా సంఘాల‌కు బ‌స్సుల కేటాయింపు

Exit mobile version