ముంబై : బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. ప్రస్తుతం పురుషుల జట్ల ఎంపికకు సంబంధించి సెలెక్షన్ కమిటీ చైర్మన్ గా ఉన్న అజిత్ అగార్కర్ పదవీ కాలం ముగిసింది. దీంతో ఆయన స్థానంలో సీనియర్ అయిన ప్రజ్ఞాన్ ఓజాను ఎంపిక చేశారు. అజిత్ అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా తప్పుకోవడంతో సీనియర్ సెలెక్షన్ ప్యానెల్‌లో ఖాళీ ఏర్పడింది. పురుషుల సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా అజిత్ అగార్కర్ చూపిన నిబద్ధత, దృఢ సంకల్పం , అందించిన సహకారానికి బీసీసీఐ కృతజ్ఞతలు తెలియజేస్తోందని పేర్కొన్నారు బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా . జూలై 2023లో ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుండి, భారత క్రికెట్‌కు కీలకమైన కాలంలో కమిటీకి నాయకత్వం వహించారు. ఈ సమయంలో భారత్ మూడు ఐసీసీ ట్రోఫీలు, రెండు ఆసియా కప్ టైటిళ్లు , ఆసియా క్రీడల్లో వరుసగా రెండు స్వర్ణ పతకాలను గెలుచుకుంది అని పేర్కొన్నారు.
జూలై 2023లో బాధ్యతలు చేపట్టిన అగార్కర్ హయాంలో, భారత పురుషుల క్రికెట్ జట్టు అద్భుతమైన విజయాలను సాధించిందన్నారు. ఈ కాలంలోనే జట్టు మూడు ఐసీసీ ట్రోఫీలు, రెండు ఆసియా కప్ టైటిళ్లు, ఆసియా క్రీడల్లో వరుసగా రెండు స్వర్ణ పతకాలను కైవసం చేసుకుందన్నారు. దీంతో ఖాళీగా ఏర్పడిన స్తానంలో ఎంపిక కమిటీలో ఉన్న సీనియర్ గా ఉన్న ప్రజ్ఞాన్ ఓజా ఛైర్ పర్సన్ గా శివ్ సుందర్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, రమేష్ పవార్ సభ్యులుగా ఉంటారని తెలిపారు సైకియా. ఇదిలా ఉండగా ఇక ప్రజ్ఞాన్ ఓజా జట్టు లో గతంలో ఆటగాడిగా ఉన్నాడు. తన స్వస్థలం ఓడిశాలోని భువన్వేశర్. జట్టు తరపున 2008 నుంచి 2013 వరకు ప్రాతినిధ్యం వహించాడు. ముఖ్యమైన స్పిన్నర్‌గా గుర్తింపు పొందారు. టెస్ట్ క్రికెట్‌లో రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి బౌలింగ్ చేసి వికెట్లు సాధించారు. 24 టెస్టులు ఆడి 113 వికెట్లు తీయగా వన్డేలలో 18 మ్యాచ్ లు ఆడి 21 వికెట్లు తీశాడు. ఇక టి20 ఫార్మాట్ లో 6 మ్యాచ్ లు ఆడి 10 వికెట్లు తీశాడు.
