చెన్నై : తమ ప్రభుత్వం క్రీడాభివృద్ది కోసం భారీ ఎత్తున నిధులను కేటాయించడం జరుగుతుందన్నారు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. చెన్నైలో తమిళనాడు క్రీడా అభివృద్ధి సంస్థ (టీఎంఎస్‌డీఏ) తరఫున నిర్వహించిన ఒక సన్మాన కార్యక్రమంలో ‘డ్రీమ్ ఒలింపిక్స్’ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన, వివిధ క్రీడా పోటీలలో పతకాలు సాధించి విజయాలు సాధించిన తమిళనాడు క్రీడాకారులను సత్కరించి, వారికి అధిక ప్రోత్సాహక చెక్కులను అందజేశారు. ప్రతి క్రీడా విభాగం లోనూ ఒక ఛాంపియన్‌ను తయారు చేయడమే దీని లక్ష్యం అని స్పష్టం చేశారు. అనేక నగరాల్లో క్రీడా మౌలిక సదుపాయాలను ఆధునీకరించడంతో పాటు క్రీడాకారుల కోసం కొత్త క్రీడా వసతి గృహాలు (హాస్టళ్లు), ఆధునిక సౌకర్యాలు , క్రీడా పరికరాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
. ప్రతి జిల్లాకు క్రీడా మద్దతును విస్తరించడం , అత్యున్నత స్థాయి క్రీడాకారుల ప్రతిభా సమూహాన్ని (టాలెంట్ పూల్) పెంపొందించడం దీని లక్ష్యం అని ప్రకటించారు సీఎం విజయ్. చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరిగిన ఆసియా క్రీడల పతక విజేతల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు . ఒలింపిక్ , పారాలింపిక్ ఛాంపియన్లను తయారు చేసే లక్ష్యంతో తమిళనాడు ప్రభుత్వం తన కొత్త క్రీడా కార్యక్రమాన్ని ఆవిష్కరించింది. డ్రీమ్ ఒలింపిక్స్ 2036 అని పిలువబడే ఈ కార్యక్రమంలో 8 నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లల కోసం తమిళనాడు అంతటా ప్రతిభా అన్వేషణ (టాలెంట్ హంట్) చేపట్టనున్నారు. ప్రతి జిల్లా నుండి ప్రతిభావంతులను గుర్తించి వారిని రాష్ట్ర అధికారిక క్రీడా వ్యవస్థలో భాగం చేయడం దీని ఉద్దేశ్యం అని ప్రకటించారు సీఎం.
