Budda Venkanna Shocking Comments : జోగి ర‌మేష్ పోలీసుల‌కు లొంగిపో : వెంక‌న్న‌

నకిలీ మద్యం పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చ

Hello Telugu - Budda Venkanna Shocking Comments

Hello Telugu - Budda Venkanna Shocking Comments

Budda Venkanna : విజ‌య‌వాడ : టీడీపీ సీనియ‌ర్ నేత బుద్దా వెంక‌న్న (Budda Venkanna) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. వైసీపీ సీనియ‌ర్ నేత జోగి ర‌మేష్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. జోగి జోగి కలిస్తే‌ బూడిద రాలినట్లు జగన్, జోగి రమేష్ కలిస్తే‌ బూడిద రాలుతుందని తేలి పోయిందన్నారు. గత ఐదేళ్ల ల్లో జగన్ అవినీతిని, హత్యలు చేసిన వారిని ప్రోత్సహించార‌ని ఆరోపించారు. దే చంద్రబాబు అయితే వెంటనే వారి పై చర్యలు తీసుకున్నారని అన్నారు. గురువారం బుద్దా వెంక‌న్న మీడియాతో మాట్లాడారు. జోగి రమేష్ కీలకపాత్ర ఉందని జనార్ధన్ స్వయంగా ప్రకటించారని, ఆ విష‌యం మ‌రిచి పోతే ఎలా అని ప్ర‌శ్నించారు. తప్పు చేసి దొరికిపోయి కూడా జోగి రమేష్ సిగ్గు లేకుండా మాట్లాడ‌టం విడ్డూరంగా ఉంద‌న్నారు బుద్దా వెంక‌న్న‌.

Budda Venkanna Slams Jogi Ramesh

చంద్రబాబు ప్రమాణం చేయాలని మాట్లాడతారా అని సీరియ‌స్ అయ్యారు. జగన్, భారతీ రెడ్డి వెంకటేశ్వర స్వామి వద్ద ప్రమాణం చేస్తారా అని స‌వాల్ విసిరారు. కల్తీ మద్యం తో సంబంధం లేని చంద్రబాబు ఎందుకు ప్రమాణం చేయాలని ప్ర‌శ్నించారు . జోగి రమేష్, జనార్ధన్ స్నేహితులం అని చెప్పలేదా అని నిల‌దీశారు. మీ ఇద్దరి మధ్య వాట్సప్ చాటింగ్, ఫేస్ టైమ్ కాల్స్ మాట్లాడింది వాస్తవం కాదా అని , ఈ విష‌యం జ‌నానికి తెలుస‌న్నారు. నువ్వు ఏ తప్పు చేయకపోతే సిట్ ముందుకు వెళ్లాల‌ని సూచించారు. నీ దగ్గర ఉన్న ఆధారాలు ఇచ్చి సచ్చీలత నిరూపించు కోవాల‌ని హిత‌వు ప‌లికారు. జగన్ అవినీతి గురించి లోకమంతా తెలుసు అంటూ ఎద్దేవా చేశారు.

Also Read : Special Welcome to PM Modi : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఘ‌న స్వాగ‌తం

Exit mobile version