న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీ వేదికగా జరిగిన బ్రిక్స్ సందర్భంగా కీలక పరిణామం చోటు చసుకుంది. ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరు కాక పోవడం చర్చకు దారితీసేలా చేసింది. పగటిపూట జరిగిన బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న తర్వాత స్వదేశానికి బయలుదేరిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ కూడా ఈ విందుకు హాజరు కాలేదు. న్యూఢిల్లీలో జరిగిన సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ సమావేశమై కరచాలనం చేసుకున్నారు. దేశాల అధినేతలు సదస్సులో పాల్గొన్న ఇతర దేశాల ప్రతినిధులు, అంతర్జాతీయ సంస్థల నాయకుల కోసం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన విందు కార్యక్రమానికి చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ హాజరు కాలేదని సంబంధిత వర్గాలు తెలిపాయి. పగటిపూట సదస్సులో పాల్గొన్న తర్వాత స్వదేశానికి వెళ్ళి పోయిన అబుదాబి క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖలీద్ బిన్ మొహమ్మద్ కూడా ఈ విందుకు హాజరు కాలేదని పేర్కొంది సర్కార్.
చైనా అధ్యక్షుడు ఎందుకు హాజరు కాలేదనే విషయంపై తక్షణ సమాచారం లేదు. కానీ ఆయన విశ్రాంతి తీసుకోవడానికి తన హోటల్‌కు తిరిగి వెళ్లారని ఒక వర్గం పేర్కొంది. చైనా అధ్యక్షుడు మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకుని బ్రిక్స్ సదస్సులో పాల్గొన్నారు. అలాగే ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశంలోనూ పాల్గొన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ , ఇతర బ్రిక్స్ నాయకులు ఈ విందుకు హాజరయ్యారు. కేంద్ర మంత్రులు , పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. విందుకు హాజరైన కేంద్ర మంత్రులలో అమిత్ షా, నిర్మలా సీతారామన్, పీయూష్ గోయల్, అశ్విని వైష్ణవ్ , శివరాజ్ సింగ్ చౌహాన్ ఉన్నారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్ (ఉత్తరప్రదేశ్), దేవేంద్ర ఫడ్నవీస్ (మహారాష్ట్ర), సువేందు అధికారి (పశ్చిమ బెంగాల్) , హిమంత బిశ్వ శర్మ (అస్సాం) కూడా విందుకు హాజరయ్యారు.
