మా మామ భూ లావాదేవీల‌లో అక్ర‌మాలు జ‌ర‌గ‌లేదు

వివ‌ర‌ణ ఇచ్చిన మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు

hellotelugu-HarishRao

హైద‌రాబాద్ : మాజీ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. కుటుంబ భూమికి సంబంధించిన ఆరోపణలను ఖండించారు. రాష్ట్ర‌ రెవెన్యూ శాఖ‌ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి సంచ‌చ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు హ‌రీష్ కుటుంబానికి సంబంధించి. మరో కేసులోని భూమిని ‘మిషన్ భగీరథ’ కోసం కాకుండా ‘గోదావరి సుజల స్రవంతి’ ప్రాజెక్ట్ కోసం సేకరించారని తెలిపారు. చెల్లింపు , మ్యుటేషన్ ప్రక్రియలు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయని ఆయన పేర్కొన్నారు. తన మామకి సంబంధించిన భూ లావాదేవీలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలను మాజీ మంత్రి ఖండించారు. అసెంబ్లీలో ‘సెక్షన్ 22-A’ (నిషేధిత భూముల జాబితా)పై జరిగిన చర్చ సందర్భంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు. తన మామ రిటైర్డ్ బ్యాంక్ అధికారి అని, ఆ భూమిని 1995లో కాంగ్రెస్ ప్రభుత్వమే కేటాయించిందని హరీష్ రావు చెప్పారు.

అదే కాంగ్రెస్ ప్రభుత్వం 2010లో అభ్యంతర రహిత ధృవీకరణ పత్రం జారీ చేసింది, ఆ తర్వాత చెక్కు ద్వారా చెల్లింపు జరిపి ఆ ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు అని ఆయన అన్నారు. భూమి కేటాయింపు, ఎన్ఓసీ జారీ, రిజిస్ట్రేషన్ – ఇవన్నీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జరిగాయన్నారు హ‌రీష్ రావు. వాస్తవాలన్నీ రికార్డుల్లో ఉన్నాయని , వాటిని కావాలంటే ప‌రిశీలంచ వ‌చ్చ‌ని స్ప‌ష్టం చేశారు. మరో కేసులోని భూమిని ‘మిషన్ భగీరథ’ కోసం కాకుండా ‘గోదావరి సుజల స్రవంతి’ ప్రాజెక్ట్ కోసం సేకరించారని చెప్పారు. బీఆర్ఎస్ నాయకులపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం ద్వారా ’22-A’ సమస్య నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ అంశంపై ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా తప్పించు కునేందుకే బీఆర్ఎస్ సభ్యులను ఉద్దేశ పూర్వకంగా అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారని ఆరోపించారు.

Exit mobile version