Special Welcome to PM Modi : ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఘ‌న స్వాగ‌తం

గ‌వ‌ర్న‌ర్ న‌జీర్, సీఎం, డిప్యూటీ సీఎం

Hello Telugu - Special Welcome to PM Modi

Hello Telugu - Special Welcome to PM Modi

PM Modi : నంద్యాల జిల్లా : ఏపీ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా దేశ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi) గురువారం నంద్యాల జిల్లాలో కొలువు తీరారు. ఆయ‌న‌కు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు రాష్ట్ర గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ నజీర్, ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్. అక్క‌డి నుండి నేరుగా సున్నిపెంట‌కు వెళ్లారు. శ్రీ‌శైలం పుణ్య క్షేత్రానికి చేరుకుంటారు. శ్రీ భ్ర‌మ‌రాంబికా మ‌ల్లికార్జున స్వామి వారిని ద‌ర్శించుకుంటారు. అక్క‌డి నుంచి క‌ర్నూల్ జిల్లాకు వెళ‌తారు. అక్క‌డ ఏర్పాటు చేసే సూప‌ర్ జీఎస్టీ, సూప‌ర్ స‌క్సెస్ పేరుతో నిర్వించే భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు. సాయంత్రం నేరుగా ఓర్వ‌కల్లు ఎయిర్ పోర్టు నుండి తిరిగి ఢిల్లీకి వెళ‌తారు.

Special Welcome to PM Modi

ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న సంద‌ర్బంగా పెద్ద ఎత్తున భ‌ద్ర‌తా ఏర్పాట్లు చేశారు. త‌న సుదీర్ఘ ప‌ద‌వీ కాలంలో దేవ ప్ర‌ధాని తొలిసారిగా శ్రీ‌శైలం మ‌ల్ల‌న్న‌ను ద‌ర్శించు కోవ‌డం ఇదే మొద‌టిసారి. దేశ వ్యాప్తంగా ఉన్న ప్ర‌ధాన ఆల‌యాల‌ను ద‌ర్శించు కోవ‌డం , వాటి చ‌రిత్ర గురించి తెలుసు కోవ‌డం చేస్తూ వ‌స్తున్నారు నరేంద్ర మోదీ. స‌భ‌లో పాల్గొనే కంటే ముందు రూ. 15 వేల కోట్ల‌కు పైగా విలువైన ప‌నుల‌కు శంకుస్థాప‌న‌లు, ప్రారంభోత్స‌వాలు చేస్తార‌ని వెల్ల‌డించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. ఇప్ప‌టికే డీజీపీ హ‌రీష్ కుమార్ గుప్తా సార‌థ్యంలో భారీ ఎత్తున సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. మ‌రో వైపు కేంద్రం నుంచి వ‌చ్చిన స్పెష‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ ప్ర‌ధాని మోదీ వెంట ఉంది.

Also Read : PM Modi Interesting Visit to Srisailam : మ‌ల్ల‌న్న స‌న్నిధిలో ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ

Exit mobile version