Beauty Sydney Sweeney-James Bond : జేమ్స్ బాండ్ మూవీలో సిడ్నీ స్వీనీ

యుఫోరియా న‌టికి జెఫ్ బెజోస్ స‌పోర్ట్

Hello Telugu - Beauty Sydney Sweeney-James Bond

Hello Telugu - Beauty Sydney Sweeney-James Bond

James Bond : అమెరికా – హాలీవుడ్ లో అతి పిన్న వ‌య‌సులోనే భారీ ఎత్తున పాపులారిటీ సంపాదించుకున్న న‌టి సిడ్నీ స్వీన్. త‌న వ‌యసు కేవ‌లం 27 ఏళ్లు మాత్ర‌మే. కానీ అసాధార‌ణ‌మైన ప్ర‌తిభతో, నైపుణ్యంతో సినిమాల‌లో న‌టించింది. కోట్లాది మంది అభిమానుల‌ను స్వంతం చేసుకుంది. ఈ ముద్దుగుమ్మ గురించి తాజాగా కీల‌క అప్ డేట్ వ‌చ్చింది. త‌నను 007 ద‌ర్శ‌కుడు డెనిస్ విల్లెన్యూవ్ త‌ను తీసే సినిమాలో ఓ పాత్ర కోసం ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం. ఇదిలా ఉండ‌గా యుఫోరియా మూవీతో రికార్డుల మోత మోగించిన సిడ్నీ స్వీన్ (Sydney Sweeney) కు అమెజాన్ బాస్ జెఫ్ బెజోస్ మ‌ద్ద‌తు ఇస్తుండ‌డం విశేషం.

James Bond Movie

జేమ్స్ బాండ్ మూవీలో సిడ్నీ స్వీనీ కీల‌క పాత్ర పోషించ‌నుంద‌ని హాలీవుడ్ లో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. అది గ‌నుక జ‌రిగితే బాండ్ గ‌ర్ల్ పాత్ర‌ను పోషించ‌నుంది. ఈ విష‌యాన్ని ఫిమేల్ ఫ‌స్ట్ యుకె ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది. నిర్మాత‌లు బార్బారా బ్రోక‌లీ, మైఖేల్ జె. విల్స‌న్ లు ఈ సినిమాను నిర్మించ‌నున్నారు. వారు సైతం త‌న‌నే ఎంపిక చేయాల‌ని ద‌ర్శ‌కుడికి చెప్పార‌ని టాక్.

ఈ సంద‌ర్బంగా ప్ర‌ముఖ ప‌త్రిక ది స‌న్ ఆన్ సండే తో నిర్మాత‌లు సంభాషించారు. జేమ్స్ బాండ్ కోసం కాస్టింగ్ షీట్ లో సిడ్నీ స్వీనీ పేరు తొలిస్థానంలో ఉంద‌న్నారు. ఆమె అత్యంత ప్ర‌తిభావంతురాలిగా ఇప్ప‌టికే ప్రూవ్ చేసుకుంది. త‌న‌కు యూత్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇది సినిమాకు ప్ల‌స్ పాయింట్ అవుతుంద‌ని పేర్కొన్నారు.

Also Read : Phanindra Narisetty Interesting Comments : క‌థ‌లు వాస్త‌వానికి ద‌గ్గ‌రగా ఉంటే ఆద‌రిస్తారు

Exit mobile version