సెలిబ్రిటీ అయినా ఇంట్లో సామ‌న్యూరాలినే : ర‌ష్మిక మంద‌న్నా

తాను ఎలా ఉంటానో సోష‌ల్ మీడియాలో చూపించిన నేష‌న‌ల్ క్ర‌ష్

hellotelugu-RashmikaMandhanna

హైద‌రాబాద్ : నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న గురించి ఎంత చెప్పినా త‌క్కువే. త‌ను ఓ వైపు సినిమాల‌లో న‌టిస్తూనే మ‌రో వైపు సోష‌ల్ మీడియాలో బిజీగా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు త‌న వ్య‌క్తిగ‌త విష‌యాల‌ను పంచుకునేందుకు ఇష్ట‌ప‌డుతుంది. ఇందులో భాగంగా తాను కూడా బ‌య‌ట సెల‌బ్రిటీ అయినా తాను ఇంట్లో సామాన్య మ‌హిళగానే ఉంటాన‌ని పేర్కొంది. తాజాగా తాను చేసిన కామెంట్స్ , ఫోటోలు ఇప్పుడు వైర‌ల్ గా మారాయి. తాజాగా షూటింగ్‌లు, కెమెరాల వెలుగులకు దూరంగా ఇంట్లో తాను ఎలా ఉంటానో చూపే కొన్ని ఆసక్తికరమైన దృశ్యాలను అభిమానులతో పంచుకున్నారు. పని ముగించుకుని ఇంటికి చేరుకున్నాక తాను ఏం చేస్తారో తెలియజేసే ఫోటోలు, వీడియోలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది రష్మిక టీమ్… పని ముగించుకుని ఇంటికి వచ్చాక ఆమె ఇలా ఉంటుంది అనే క్యాప్షన్‌తో ఆమె వీటిని షేర్ చేశారు. మొదటి ఫోటోలో, రష్మిక తెల్లని టీ-షర్ట్, నల్లని ట్రాక్ ప్యాంట్ , పింక్ హెడ్‌బ్యాండ్ ధరించి, నేలపై కూర్చుని చిరునవ్వు చిందిస్తూ కనిపించారు.

తర్వాతి ఫోటోల్లో ఆమె వ్యాయామం చేస్తుండగా, ఆమె పెంపుడు కుక్క పక్కనే ఉంటూ సందడి చేయడం కనిపిస్తుంది. ట్రైనర్ సహాయంతో ఎక్సర్‌సైజ్ మ్యాట్‌పై డంబెల్స్‌తో వ్యాయామం చేస్తున్న దృశ్యాలు, అలాగే ఎర్రటి ఎక్సర్‌సైజ్ బాల్‌పై పడుకున్నప్పుడు ఆమె పెంపుడు కుక్క ఆమెను ముద్దులతో ముంచెత్తుతున్న సరదా వీడియో అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఇటీవల రష్మిక, విజయ్ దేవరకొండ, ఆయన తల్లిదండ్రులు , సోదరుడు ఆనంద్ దేవరకొండతో కలిసి జపాన్‌కు కుటుంబ పర్యటనకు వెళ్లి వచ్చారు. ఈ పర్యటనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ, విజయ్ “నా ప్రియమైన వారితో జీవితాన్ని ఆస్వాదిస్తున్నాను” అని పేర్కొన్నారు. అయితే, ఒక కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు, పెళ్లి తర్వాత తన తల్లిదండ్రులను ఏడాదికి ఒకటి లేదా రెండుసార్లు విదేశీ పర్యటనలకు తీసుకెళ్లడమే తన ప్రాధాన్యత అని విజయ్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో నెటిజన్ల విమర్శలకు దారితీశాయి. కేవలం తన తల్లిదండ్రులపైనే కాకుండా, రష్మిక తల్లిదండ్రుల పట్ల కూడా ఆయనకు సమాన బాధ్యత ఉండాలి కదా అని కొందరు ప్రశ్నించడంతో దీనిపై చర్చ మొదలైంది.

Exit mobile version