Phanindra Narisetty : కొంత గ్యాప్ తర్వాత దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి (Phanindra Narisetty) 8 వసంతాలు అనే పేరుతో సినిమా తీశాడు. ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎలాంటి కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా హాయిగా, సాఫీగా, మనసుకు హత్తుకునేలా సినిమాను చిత్రీకరించాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటి వరకు వచ్చిన సినిమాలలో ఇది క్లాసిక్ అని చెప్పక తప్పదు. పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుండడంతో స్పందించాడు దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి. చిట్ చాట్ సందర్బంగా తన మనసులోని భావాలను పంచుకున్నాడు.
Phanindra Narisetty Comments
ఏ సినిమాకైనా కథే మూలం, అదే బలం. దానిని ఎవరూ కాదనలేని సత్యం. కథలు ఎంత వాస్తవానికి దగ్గరగా ఉంటే అవి ముమ్మాటికి ప్రేక్షకులను మరింత దగ్గరయ్యేలా చేస్తాయని అన్నాడు. ప్రతి పాత్రకు న్యాయం చేయాలి. ఒక పాత్రకు ఎక్కువ ప్రయారిటీ ఇస్తే అది సినిమా అనిపించు కోదన్నాడు దర్శకుడు. తను ఏది ఫీల్ అవుతాడో, తాను ఏం చెప్పాలని అనుకున్నాడో దానినే క్లియర్ గా ప్రజెంట్ చేసేలా ఉండాలన్నాడు. లేక పోతే సినిమాను ప్రేక్షకులు ఒప్పుకోరని తెలిపాడు.
మనకంటే ఎక్కువగా సినిమాలు చూసే వాళ్లు ఆలోచిస్తారని, వారిని దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీస్తే తప్పకుండా ఆడతాయని , ఆ భయం తనకు లేదన్నాడు. ఎందుకంటే తాను ఏది తీయాలని అనుకుంటానో దానికే కట్టుబడి ఉంటానని స్పష్టం చేశాడు దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి. నా మూవీలో మహిళలకు ఉదాత్తమైన పాత్రలు ఉంటాయన్నాడు. వారికి అరుదైన గౌరవం, గుర్తింపు ఉంటుందన్నాడు. 8 వసంతాలు మంచి ఆదరణ పొందుతుండడం మామూలేనని పేర్కొన్నాడు. ఈ సినిమా ఒక సంఘటన కానే కాదని, ఇది జీవితానికి సంబంధించిన వాస్తవ కథ అని చెప్పాడు.
Also Read : President Droupadi Murmu Approved : ఆ నలుగురు రాజ్యసభకు నామినేట్
