Supreme Court Important Case Hearing : సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల విచారణ

తెలంగాణ వ్యాప్తంగా చర్య‌లు తీసుకుంటారా లేదా ఉత్కంఠ‌

Hello Telugu - Supreme Court Important Case Hearing

Hello Telugu - Supreme Court Important Case Hearing

Supreme Court : హైద‌రాబాద్ : అంద‌రి దృష్టి ఇవాళ భార‌త దేశ స‌ర్వోన్న‌త ప్ర‌ధాన న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చే తుది తీర్పుపై ప‌డింది. దీనికి కార‌ణంగా ఇప్ప‌టికే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీ ఫారం పై గెలిచి ఆ త‌ర్వాత కాంగ్రెస్ కండువా క‌ప్పుకున్న 10 మంది ఎమ్మెల్యేల భ‌విత‌వ్యం తేలి పోనుంది. ఇప్ప‌టికే వీరి ఫిరాయింపు చెల్లుబాటు కాదంటూ బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మ‌రో ఎమ్మెల్యే సుప్రీంకోర్టులో పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు గ‌తంలో కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ఆపై సంచ‌ల‌న కామెంట్స్ చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. వీరిపై వేటు వేస్తారా లేదా అన్న‌ది త‌మ చేతుల్లో లేక పోయిన‌ప్ప‌టికీ ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా ఎన్నికైన ప్ర‌జా ప్ర‌తినిధులు బాధ్య‌త‌గా ఉండాల‌ని, జ‌వాబుదారీత‌నంతో లేక పోతే ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయని పేర్కొంది. ఒక ర‌కంగా చీవాట్లు పెట్టింది. ఈ మేర‌కు స్పీక‌ర్ కు చుర‌క‌లు అంటించింది కూడా.

Supreme Court Comments

ఇచ్చిన గ‌డువు మూడు నెల‌లు పూర్త‌యింది. దీంతో తీర్పుపై ఉత్కంఠ కొన‌సాగుతోంది. వారిపై చ‌ర్య‌లు తీసుకుంటారా లేక విడిచి పెడ‌తారా అన్న‌ది తేలాల్సి ఉంది. కోర్టు ధిక్కరణ కింద స్పీకర్ పై పిటిషన్ దాఖలు చేశారు కేటీఆర్. ఇది లా ఉండ‌గా గడువు పొడిగించాలని మరో పిటిషన్ దాఖలు చేసింది స్పీకర్ కార్యాలయం . రెండు పిటిషన్ లు కలిపి విచారణ చేయనుంది సీజేఐ ధర్మాసనం. 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని సుప్రీంకోర్టులో వాదనలు వినిపించనున్నారు కేటీఆర్ తరుపు న్యాయవాది . ఇలాంటి కేసు కోల్ క‌తా హైకోర్టులో పిటిష‌న్ దాఖ‌లైంది. దీనిపై సంచ‌ల‌న తీర్పు వెలువ‌రించింది ధ‌ర్మాస‌నం. బీజేపీ ఎమ్మెల్యే ముకుల్ రాయ్ పై అనర్హత వేటు వేసింది.

Also Read : KTR Fired on Congress Govt : స‌ర్కార్ నిర్ల‌క్ష్యం ప‌త్తి రైతులు ఆగ‌మాగం

Exit mobile version