ప్రైవేట్ విమాన ప్రయాణాన్ని సమర్థించుకున్న సీఎం

ప్రజాధనం వినియోగించ లేదని స్పష్టం చేసిన స‌తీశ‌న్

hellotelugu-KeralaCM

తిరువ‌నంత‌పురం : భయంకరమైన ఆకస్మిక వరదల కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన మలప్పురం ప్రాంతాన్ని సందర్శించేందుకు సోమవారం నాడు బెంగళూరు నుండి కోజికోడ్‌కు చార్టర్డ్ విమానంలో ప్రయాణించిన సతీశన్‌పై తీవ్ర విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో స్పందించారు సీఎం. ప్రైవేట్ విమాన ప్రయాణాన్ని సమర్థించుకున్నారు. ప్రజాధనం వినియోగించ లేదని స్పష్టం చేశారు. ప్రైవేట్ విమానంలో ప్రయాణించడాన్ని గట్టిగా సమర్థించుకుంటూ కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ బుధవారం నాడు ఒక విషయం స్పష్టం చేశారు. ఈ ప్రయాణం కోసం ప్రజాధనం నుండి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని, భవిష్యత్తులో కూడా శ్రేయోభిలాషులు ఆఫర్ చేస్తే ప్రైవేట్ విమానాలను వినియోగించడం కొనసాగిస్తానని ఆయన పేర్కొన్నారు.

భయంకరమైన ఆకస్మిక వరదల కారణంగా ఐదుగురు ప్రాణాలు కోల్పోయిన మలప్పురం ప్రాంతాన్ని సందర్శించేందుకు 21న బెంగళూరు నుండి కోజికోడ్‌కు చార్టర్డ్ విమానంలో ప్రయాణించిన సతీశన్‌పై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఈ వివరణ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు. తిరువనంతపురంలో జరిగిన విలేకరుల సమావేశంలో ముఖ్యమంత్రి సతీశన్ మాట్లాడారు. అవసరమైనప్పుడు ముఖ్యమంత్రులు ప్రైవేట్ విమానాల్లో ప్రయాణించడం దేశ వ్యాప్తంగా సాధారణమేనని పేర్కొన్నారు. దాదాపు ప్రతి రాష్ట్రానికి చెందిన ముఖ్యమంత్రులు ప్రైవేట్ విమానాల్లో ప్రయాణించారు, ఇందులో పినరయి విజయన్ కూడా ఉన్నారు. కొద్దిమంది ప్రముఖుల వద్ద మాత్రమే ప్రైవేట్ విమానాలు ఉంటాయి, వారిని నిందించడం సరికాదు. నా ప్రైవేట్ విమాన ప్రయాణం కోసం ప్రజాధనం నుండి ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదు. ఒక స్నేహితుడు ఈ ప్రయాణాన్ని సమకూర్చారు. మరో మార్గం అందుబాటులో ఉన్నప్పుడు లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. భవిష్యత్తులో కూడా నేను ప్రైవేట్ విమానాల్లో ప్రయాణిస్తాను అని సతీశన్ చెప్పారు.

Exit mobile version