KTR Fired on Congress Govt : స‌ర్కార్ నిర్ల‌క్ష్యం ప‌త్తి రైతులు ఆగ‌మాగం

ఆవేద‌న వ్య‌క్తం చేసిన మాజీ మంత్రి కేటీఆర్

Hello Telugu - KTR Fired on Congress Govt

Hello Telugu - KTR Fired on Congress Govt

KTR : హైద‌రాబాద్ : ఆరుగాలం కష్టించి పత్తిని పండించిన తెలంగాణ రైతన్నలు నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల మార్కెట్ యార్డుల్లో పడిగాపులు పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR). కళ్ల ముందే పండించిన పత్తి ఈ చలికాలపు తేమకు పాడవుతోంటే ఆదుకోవాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలేమో మొద్దు నిద్ర నటిస్తున్నాయని ఆరోపించారు. నెల రోజుల్లో 28 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యం కాగా కేవలం 1.12 లక్షల టన్నుల పత్తి కొనుగోలు చేశారంటేనే రాష్ట్రంలో నెలకొన్న పత్తి కొనుగోళ్ళ సంక్షోభానికి అద్దం పడుతోంద‌న్నారు. తేమ శాతం, కపాస్ మొబైల్ యాప్ రిజిస్ట్రేషన్, మిల్లుల గ్రేడింగ్ అంటూ కుంటి సాకులతో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) పత్తి కొనుగోలు నిరాకరిస్తుంటే, దానికి జిన్నింగ్ మిల్లుల అవినీతి తోడై రైతన్న నడ్డి విరుస్తున్నదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు కేటీఆర్.

KTR Slams Congress Govt

మద్ధతు ధర దొరకక, మధ్య దళారులకు తెగనమ్ముకుని నష్టాల పాలవుతున్నార‌ని వాపోయారు మాజీ మంత్రి. రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ బిజెపి, ఎంపీలు వెంటనే పత్తి కొనుగోలుకు కేంద్రంపైన ఒత్తిడి తీసుకు రావాలని డిమాండ్ చేస్తున్నానని అన్నారు. ఓ వైపు రైతులు ఆగ‌మాగం అవుతుంటే ఇప్ప‌టి వ‌ర‌కు పీఎం మోదీ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ప‌ట్టించు కోలేద‌ని ఆరోపించారు. వ్య‌వ‌సాయ రంగం తీవ్ర సంక్షోభంలో కొన‌సాగుతోంద‌న్నారు. రాష్ట్రంలో పాల‌న గాడి త‌ప్పింద‌ని మండిప‌డ్డారు కేటీఆర్.

Also Read : Minister Gottipati Ravi Kumar Clear Instructions : ప్ర‌తి ఇంటికీ సంక్షేమ ప‌లాలు అందాలి

Exit mobile version