విశాఖ‌ను దోచి పెడుతున్న చంద్ర‌బాబు నాయుడు

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి

hellotelugu-YSJagan

తాడేప‌ల్లి గూడెం : మాజీ సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి నిప్పులు చెరిగారు సీఎం చంద్ర‌బాబు నాయుడుపై.
వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో గ్రేటర్‌ విశాఖలో పార్టీకి చెందిన మాజీ ప్రజా ప్రతినిధులు, సీనియర్‌ నేతలు, నాయకులతో పాటు, ముఖ్య కార్యకర్తలతో స‌మావేశం నిర్వ‌హించారు. ఈరోజు రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఎలా జరుగుతున్నాయి అన్న విషయం నాకన్నా కూడా చక్కగా, మీలో ఎవరికి మైక్‌ ఇచ్చినా బాగా మాట్లాడగలుగుతారని అన్నారు. గత మన ప్రభుత్వానికి, ఈ రెండున్నర ఏళ్ల వెన్నుపోటు పార్టీ కూటమి ప్రభుత్వ పాలన మధ్య తేడాను ప్రజలు ఇప్పటికే గుర్తించారని పేర్కొన్నారు. దేవుడి దయ వల్ల ఎవరూ చేయని విధంగా పరిపాలన చేశాం అన్నారు. మనం రాకముందు రాజకీయ నాయకులపై విశ్వసనీయత తీసుకొచ్చింది మన‌మేన‌ని చెప్పారు. మన ప్రభుత్వం రాక ముందు మ్యానిఫెస్టో అంటే కేవలం ఒక బుక్‌ మాత్రమేన‌ని, ఎన్నికల ముందు ప్రకటన. ఆ తర్వాత దాన్ని చెత్తబుట్టలో వేయడం చూశాం అన్నారు.

అదే మ్యానిఫెస్టోను ఒక ఖురాన్, బైబిల్, భగవద్గీతగా భావిస్తూ, 99 శాతం అమలు చేసింది ఒక్క మన వైయస్సార్‌సీపీ ప్రభుత్వం మనదేన‌ని చెప్పారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి. అలా రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత తీసుకొచ్చామ‌ని పేర్కొన్నారు. విద్యా రంగం పై ప్ర‌స్తావిస్తూ గతంలో ఎవరూ చేయగలుగుతారా అనుకునే విధానం నుంచి చేయగలం అని చేసి చూపామ‌న్నారు. గవర్నమెంటు స్కూళ్లు ప్రైవేటు స్కూళ్లకు థీటుగా తీర్చిదిద్దాం అన్నారు. నాడు–నేడు (మనబడి) కార్యక్రమంతో గవర్నమెంటు బడులను పూర్తిగా మార్చేశాం. ఇంగ్లిష్‌ మీడియమ్‌ ప్రవేశ పెట్టాం. 3వ తరగతి నుంచి టోఫెల్‌ శిక్షణ ఇచ్చాం. బైలింగ్వువల్‌ టెక్సట్‌ బుక్స్‌. 6వ తరగతి నుంచే డిజిటలైజ్‌ బోర్డులు. 8వ తరగతి నుంచే ట్యాబ్‌లు పంపిణీ చేసిన‌ట్లు తెలిపారు. ఇవన్నీ రావడంతో గవర్నమెంటు బడుల్లో నో వెకెన్సీ. చివరకు సీటు కోసం ఎమ్మెల్యేల సిఫార్సు చేయాల్సి వచ్చిందన్నారు.

వైద్య ఆరోగ్య రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం అని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీలో 1000 ప్రొసీజర్ల నుంచి 3300 ప్రొసీజర్లకు పెంచాం అన్నారు. పథకంలో వైద్యం ఖర్చును రూ.25 లక్షల వరకు పెంచామ‌ని తెలిపారు జ‌గ‌న్ రెడ్డి. నాడు–నేడుతో ఆస్పత్రుల రూపురేఖలు మార్చేశాం. గవర్నమెంట్‌ ఆస్పత్రుల్లో నో వెకెన్సీ పాలసీ తీసుకొచ్చాం. అన్ని పోస్టులు భర్తీ చేశాం అన్నారు. అందుకే గవర్నమెంటు ఆస్పత్రుల్లో సూపర్‌ స్పెషలిస్టుల కొరత దేశ వ్యాప్తంగా 61 శాతం ఉంటే, అది మన దగ్గర కేవలం 4 శాతం మాత్రమే ఉంద‌న్నారు. గవర్నమెంటు ఆస్పత్రుల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రమాణాలతో కూడిన మందులు అందుబాటులో ఉంచామ‌న్నారు. గ్రామస్థాయిలో విలేజ్‌ క్లినిక్స్‌ వచ్చాయని పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలోనూ కనీవిని ఎరగని మార్పులు తీసుకొచ్చాం అన్నారు జ‌గ‌న్ రెడ్డి.

Exit mobile version