Shweta Menon : కేరళ – ప్రముఖ సినీ నటి శ్వేతా మీనన్ సంచలనంగా మారారు. తాను త్వరలో జరగనునన్న సినిమా రంగానికి చెందిన ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకుంది. కాగా ఐటీ చట్టం, అనైతిక అక్రమ రవాణా నిరోధక చట్టం కింద ఊహించని రీతిలో పోలీసులు శ్వేతా మీనన్ పై కేసు నమోదు చేశారు. దీనిపై తీవ్రంగా స్పందంచారు నటి. ఈ మేరకు ఆమె కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ సదర్బంగా దావాలో
అశ్లీల చిత్రాల కేసును పక్కన పెట్టాలని తను కోరారు. రతినిర్వేదం, సాల్ట్ ఎన్ పెప్పర్, బంధన్ , అశోక చిత్రాలలో నటించి గుర్తింపు పొందారు.
Shweta Menon Requesting
అశ్లీల చిత్రాలు, వాణిజ్య ప్రయోజనాల కోసం ప్రకటనలలో నటించినందుకు తనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను రద్దు చేయాలని గురువారం కోర్టును ఆశ్రయించింది. ఆగస్టు 15న జరగనున్న అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మ) అధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తోంది శ్వేతా మీనన్ (Shweta Menon). నటి తరపున న్యాయవాదులు సెబాస్టియన్ కప్పెన్, ఎం. రేవి కృష్ణన్ ల ద్వారా పిటిషన్ దాఖలు చేసింది.
కాగా ఎర్నాకుళం పోలీసులు బుధవారం శ్వేతా మీనన్‌పై అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం, 1956లోని సెక్షన్లు 3, 5 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం, 2000లోని సెక్షన్ 67(A) (లైంగిక అసభ్యకరమైన చర్యలను కలిగి ఉన్న విషయాలను ప్రచురించడం లేదా ప్రసారం చేయడం) కింద నేరాలకు పాల్పడినట్లు FIR నమోదు చేశారు. కాగా మార్టిన్ మెనాచేరి అనే కార్యకర్త ఫిర్యాదు మేరకు శ్వేతా మీనన్ పై కేసు నమోదు చేశారు. ఎర్నాకుళం CJM కోర్టు స్థానిక పోలీసులను ఈ విషయంలో చర్యలు ప్రారంభించాలని ఆదేశించింది.
Also Read : Venkaiah Naidu Shocking Comments : ఈ దేశ భవితవ్యం మీ చేతుల్లోనే ఉంది – వెంకయ్య
