‘ఓరి నాయనో’ మూవీ టైటిల్ లాంచ్

హీరో న‌వీన్ చంద్ర చేతుల మీదుగా

hellotelugu-OriNayanoMoviee

హైదరాబాద్ : సిల్వ‌ర్ స్క్రీన్‌పైకి మరో ఆసక్తికరమైన చిత్రం రాబోతోంది. వీరాంజనేయ ప్రొడక్షన్స్ బ్యాన‌ర్ పై సాయి అభిషేక్ నిర్మాణంలో, డైరెక్ట‌ర్ గొండి మణితేజ తెర‌కెక్కిస్తున్న ఓరి నాయనో సినిమా టైటిల్‌తో పాటు, సినిమా కార్యాల‌యాన్ని హీరో న‌వీన్ చంద్ర ఆవిష్క‌రించారు. మాదాపూర్‌లోని వీరాంజనేయ ప్రొడక్షన్ ఆఫీసులో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో ‘మా ఊరి పొలిమెర’ డైరెక్ట‌ర్ అనిల్ విశ్వ‌నాథ్, న‌టులు స‌త్యం రాజేష్, రాజా ర‌వింద్ర‌, డీవోపీ వెట్రి ప‌ళ‌నిస్వామితో పాటు, చిత్ర‌యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా దర్శకుడు గొండి మణితేజ మాట్లాడారు. ప్రతి గొప్ప ప్రయాణం విశ్వాసంతోనే ప్రారంభమవుతుంది. ఈ రోజు జరిగిన పూజా కార్యక్రమం నా హృదయానికి దగ్గరైన ఒక కథను ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి మొదటి అడుగు. ప్రేక్షకులకు వినోదాన్ని అందించడంతో పాటు గుర్తుండి పోయే పాత్రలు, క్షణాలను అందించే చిత్రాన్ని రూపొందించేందుకు మా కృషి కొనసాగుతుందని స్ప‌ష్టం

నిర్మాత సాయి అభిషేక్ మాట్లాడుతూ ఈ చిత్రాన్ని ఉన్నత నిర్మాణ విలువలతో, ప్రతిభావంతమైన సాంకేతిక బృందంతో రూపొందిస్తున్నామని తెలిపారు. విభిన్నమైన కథలను ప్రోత్సహించడం, అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే కమర్షియల్ సినిమాలను అందించడం వీరాంజనేయ ప్రొడక్షన్స్ లక్ష్యమని పేర్కొన్నారు. ఓరి నాయనో చిత్రం వినోదం, భావోద్వేగాలు, ఆధునిక కథనాన్ని సమ్మిళితం చేసిన కొత్త తరహా కథతో ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంద‌ని, వినోదంతో పాటు అనూహ్య మలుపులు, నేటి సమాజాన్ని ప్రతిబింబించే పాత్రలతో ఈ చిత్రం తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రస్తుతం నటీనటుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతుండగా, ప్రధాన తారాగణం, ఇతర సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో ప్రకటించనున్నారు.

Exit mobile version