చెన్నై : ప్రముఖ తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన నటుడు విశాల్ రడ్డి కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన కీలక అప్ డేట్ ఇచ్చారు. చెన్నైలో ‘నడిగర్ సంఘం’ భవన నిర్మాణం తుది దశలో ఉందని వెల్లడించారు. ఇవాళ జరిగిన నడిగర్ సంఘం కార్యవర్గ సభ్యుల సమావేశానికి హాజరయ్యారు. తోటి నటులను కలుసుకుని, సంఘంకు సంబంధించిన కొత్త ప్రధాన కార్యాలయ నిర్మాణ పురోగతిని సమీక్షించిన తర్వాత తాజా వివరాలను పంచుకున్నారు. సోషల్ మీడియాలో సమావేశానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ విశాల్ ఇలా రాశారు. నడిగర్ సంఘం కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సభ్యుల సమావేశంలో నేను నా సినీ కుటుంబాన్ని కలుసుకున్నాను. మా చిరకాల స్వప్నమైన చారిత్రాత్మక ‘సౌత్ ఇండియన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ భవన నిర్మాణ పనుల తుది దశ కోసం మొత్తం బృందం వేగంగా సన్నద్ధమవుతోంది అని తెలిపారు.
ఎన్నో ఏళ్ల జాప్యం తర్వాత ఈ కీలక ప్రాజెక్ట్ త్వరలోనే ప్రారంభం కానుందనే ఆశలను రేకెత్తిస్తూ, కోలీవుడ్ నటుడు విశాల్ ఈ విషయాన్ని వెల్లడించారు. తోటి నటులతో సమావేశమై, కొత్త కార్యాలయ నిర్మాణ పురోగతిని సమీక్షించిన అనంతరం ఆయన ఈ అప్‌డేట్ ఇచ్చారు. భవన నిర్మాణ పనుల తుది దశ కోసం మొత్తం బృందం వేగంగా సన్నద్ధమవుతోంది అని తెలిపారు విశాల్. సహచరులతో జరిపే ప్రతి సమావేశం తనకు సానుకూల దృక్పథాన్ని ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే, అనేక అడ్డంకులను అధిగమించడానికి ఈ ప్రాజెక్ట్‌కు సంవత్సరాల తరబడి సామూహిక కృషి, న్యాయపరమైన పోరాటాలు, నిరంతర శ్రమ , పట్టుదల అవసరమయ్యాయని విశాల్ తెలిపారు.
