Shaheen Shah Afridi : పాకిస్తాన్ : పాకిస్తాన్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (పీసీబీ) సంచలన ప్రకటన చేసింది. వన్డే జట్టు కెప్టెన్ గా రిజ్వాన్ స్థానంలలో షాహీన్ షా అఫ్రిదిని (Shaheen Shah Afridi) ఎంపిక చేసింది. ఈ విషయాన్ని మంగళవారం అధికారికంగా వెల్లడించింది. ఇస్లామాబాద్‌లో జరిగిన సమావేశంలో జాతీయ సెలెక్టర్లు, సలహా బోర్డు సభ్యులు హెస్సన్ హాజరైన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బోర్డు తెలిపింది. కాగా ముహమ్మద్ రిజ్వాన్‌ను వన్డే కెప్టెన్‌గా తొలగించి ఎడమ చేయి పేసర్ షహీన్ షా అఫ్రిదికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తీసుకున్న నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది. వైట్-బాల్ హెడ్ కోచ్ మైక్ హెస్సన్ అతనితో ఒకే ఒక సిరీస్ కోసం పని చేసినప్పటికీ ఈ మార్పు కోసం ఒత్తిడి తెచ్చారని నివేదికలు సూచిస్తున్నాయి.
Shaheen Shah Afridi As A Pakistan
నవంబర్ 4-8 వరకు ఫైసలాబాద్‌లో దక్షిణాఫ్రికాతో జరిగే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో షాహీన్ పాకిస్తాన్‌కు నాయకత్వం వహిస్తారని పిసిబి ప్రకటించింది. షహీన్ పాకిస్తాన్ తరపున 66 వన్డేలు , 92 టీ20లు, 32 టెస్ట్‌లలో ఆడాడు. అయితే, ఈ చర్య పాకిస్తాన్ క్రికెట్ వర్గాలలో ఊహాగానాలకు దారితీసింది. మే చివరలో వైట్-బాల్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, పాకిస్తాన్ సూపర్ లీగ్ తర్వాత, హెస్సన్ రిజ్వాన్‌తో ఒకే ఒక వన్డే సిరీస్‌లో – వెస్టిండీస్‌తో మూడు మ్యాచ్‌ల పర్యటనలో మాత్రమే పని చేశాడు. వికెట్ కీపర్ బ్యాటర్ స్ట్రైక్ రేట్ 45 శాతంగా ఉంది. కాగా కేవలం ఒక సిరీస్ తర్వాత రిజ్వాన్ కెప్టెన్సీ గురించి హెస్సన్ ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకోవడం వింతగా ఉందన్నారు ఒమైర్ అలవి.
Also Read : CM Chandrababu Clear Warning : శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే జాగ్రత్త



















