RSS Chief Bhagwat Important Comments : వ్య‌క్తిత్వ వికాసం ఆర్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశం

రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క్ సంఘ్ చీఫ్ భ‌గ‌వ‌త్

Hello Telugu - RSS Chief Bhagwat Important Comments

Hello Telugu - RSS Chief Bhagwat Important Comments

Bhagwat : ముంబై : ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహ‌న్ భ‌గ‌వ‌త్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఈ దేశంలో జ‌రిగిన స్వాతంత్ర పోరాటంలో ఆర్ఎస్ఎస్ కు సంబంధించి ఎవ‌రైనా ఒక్క‌రైనా ప్రాణాలు కోల్పోయారా అని ఎంఐఎం చీఫ్ , ఎంపీ అస‌దుద్దీన్ ఓవైసీ ప్ర‌శ్నించారు. ఆయ‌న‌కు ధీటుగా కౌంట‌ర్ ఇచ్చారు ఆర్ఎస్ఎస్ బాస్. సమగ్రత, నిస్వార్థత, సామాజిక నాయకత్వం ద్వారా సామాజిక మార్పును సాధించవచ్చని అన్నారు. అందుకే ఆర్ఎస్ఎస్ ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింద‌న్నారు. అంతే కాదు ఆర్‌ఎస్‌ఎస్ దురాశపై కాదు వ్యక్తిత్వంపై దృష్టి పెట్టిందని అన్నారు. భారతదేశానికి సంబంధించి భాషలు, విశ్వాసాలు, జీవనశైలి, సంప్రదాయాల వైవిధ్యాన్ని ఒక బలంగా చూడాలని పేర్కొన్నారు. విదేశీ మతాలను స్వీకరించిన వారితో సహా అన్ని సమాజాలు ఇండియాలో భాగ‌మేన‌ని స్ప‌ష్టం చేశారు మోహ‌న్ భ‌గ‌వ‌త్ (Bhagwat). సామరస్యం, పరస్పర గౌరవం అనేది మ‌నుషుల మ‌ధ్య ఉంఆల‌ని , హింసను విడ‌నాడాల‌ని అది ఎన్నటికీ ఆమోద యోగ్యం కాద‌న్నారు.

RSS Chief Bhagwat Comments

దురాశతో ఆకర్షితులయ్యి రాజకీయాల్లో చేరమని ఆహ్వానించ బడినప్పటికీ గత 100 సంవత్సరాలుగా సంఘ్ వ్యక్తి నిర్మాణం అనే దాని ప్రధాన లక్ష్యానికి కట్టుబడి ఉందని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శతాబ్ది ఉత్సవాలకు గుర్తుగా నాగ్‌పూర్‌లో జరిగిన వార్షిక విజయదశమి కార్యక్రమంలో స్వయంసేవకులను ఉద్దేశించి ప్ర‌సంగించారు. గ‌తంలో చేసిన తీర్మానాల‌ను పంచు కోవ‌డ‌మే ల‌క్ష్యంగా పెట్టుకుంద‌న్నారు మోహ‌న్ భ‌గ‌వ‌త్. విధ్వంసాన్ని నివారించడానికి దశలవారీ సంస్కరణల అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. భారతదేశం సంపూర్ణ సమగ్ర దృక్పథం ఆధారంగా అభివృద్ధి నమూనాను ప్రదర్శించింద‌న్నారు.

Also Read : BC Janardhan Reddy Clear Instructions : అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

Exit mobile version