BC Janardhan Reddy : అమరావతి : భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి (BC Janardhan Reddy). ఆర్ అండ్ బి శాఖ ఎస్ఈలతో సమీక్ష చేపట్టారు. క్షేత్రస్థాయిలో బలహీనంగా ఉన్న రోడ్లకు గండ్లు, కోతకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు మరమ్మత్తులు చేపట్టాలని ఆదేశించారు. ప్రజా రవాణాకు ఇబ్బంది లేకుండా తక్షణం పునరుద్ధరణ పనులు చేపట్టాలన్నారు మంత్రి. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ జిల్లాలో ఏదైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలని సూచించారు బీసీ జనార్దన్ రెడ్డి. ఎక్కడైనా కల్వర్టులు కూలితే ప్రజా రవాణాకు అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు.
Minister BC Janardhan Reddy Clear Instrustions
ఇదిలా ఉండగా ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మరోసారి హెచ్చరికలు జారీ చేసింది ఏపీ సర్కార్ కు. అల్పపీడనం ఏర్పడడంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కాగా ఎడ తెరిపి కురుస్తున్న వర్షాల కారణంగా వంశధార, నాగావళి నదులకి వరద ప్రవాహం పోటెత్తింది. గొట్టాబ్యారేజ్, తోటపల్లి వద్ద అంతకంతకూ వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో అధికారులు గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం ఇన్ ఫ్లో , ఔట్ ఫ్లో 68,893 క్యూసెక్కులు కాగా తోటపల్లి వరద ఇన్ ఫ్లో 30,840, ఔ ట్ ఫ్లో 14,970 క్యూసెక్కులకు చేరుకుంది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం జిల్లాలలో వర్షాలు కురుస్తాయని ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు.
గోదావరి ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 9,31,664 క్యూసెక్కులు ఉండగా కృష్ణా ప్రకాశం బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 1,97,250 క్యూసెక్కులుగా ఉందన్నారు.
Also Read : శాస్త్రోక్తంగా తిరుమలేశుని శ్రీచక్ర తిరుమంజనం
