హైదరాబద్ : ఏసీబీ దూకుడుకు దెబ్బకు అవినీతి అధికారుల బండారం బయట పడుతోంది. హైదరాబాద్ లోని హైదరాబాద్ నగర పాలక సంస్థ (హెచ్ఎండీఏ) లో చీఫ్ ఇంజనీర్ గా పని చేస్తున్న బచ్చు రవిందర్ పై పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వచ్చాయి. దీంతో తెలంగాణ ఏసీబీ రంగంలోకి దిగింది. తనను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుంది. పలు సోదాలు చేపట్టింది. భారీ ఎత్తున ఆస్తులు కూడబెట్టినట్లు తేలింది. రవీందర్‌కు చెందిన రూ. 50 కోట్ల విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకుంది. నగర పరిధిలోని కొండకల్, కిష్టాపూర్ మరియు పాసమల ప్రాంతాలలో ఐదు ఖాళీ ప్లాట్లు ఉన్నట్లు గుర్తించింది. నార్సింగి , నానక్‌రామ్‌గూడలో నాలుగు నివాస ఫ్లాట్లు, కొత్తూరు మండలం గూడూరు గ్రామంలో 4 ఎకరాల వ్యవసాయ భూమి (విలువ రూ. 6,00,000), శంకరపల్లి మండలం మోకిల గ్రామంలోని శ్రీవారి మెడోస్‌లో 300 చదరపు గజాల విస్తీర్ణంలో పాక్షికంగా పూర్తయిన నివాస విల్లా (విలువ రూ. 1,33,58,800) ఉన్నట్లు తేలింది సోదాలలో.
ఇక కొండాపూర్ లోని మసీద్ బండ వద్ద 300 చదరపు గజాల విస్తీర్ణంలో G+4 భవనం (విలువ రూ. 3,00,00,000). పైన పేర్కొన్న ఆస్తుల మార్కెట్ విలువ, అధికారికంగా నమోదైన విలువ కంటే చాలా ఎక్కువగా ఉంటుందని అంచనా. రూ. 3,82,000 నగదు, సుమారు రూ. 45,05,776 విలువైన బ్యాంక్ నిల్వలు, 1,440 గ్రాముల బంగారు ఆభరణాలు (విలువ సుమారు రూ. 36,70,000), 12.5 కిలోల వెండి ఆభరణాలు (విలువ సుమారు రూ. 10,00,000), రూ. 1,16,00,000 విలువైన నాలుగు వాహనాలు ఉన్నట్టు తేలింది సోదాలలో. ఏసీబీ డీఎస్పీ మాజిద్ అలీఖాన్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు చేపట్టారు. మొత్తంగా మనోడు అక్రమాస్తుల విలువ దాదాపు రూ. 50 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా.
