RBI Approved : దేశంలో అతిపెద్ద సహకార బ్యాంకుగా పేరుగాంచిన సరస్వత్ కో-ఆపరేటివ్ బ్యాంక్, ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న **న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ (NICBL)ను విలీనం చేసుకోనుంది. ఈ విలీనానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అధికారికంగా ఆమోదం తెలిపిందని శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
ఈ ప్రక్రియ 2025 ఆగస్టు 4 నుంచి అధికారికంగా అమల్లోకి వస్తుంది. ఆ తేదీ నుంచి న్యూ ఇండియా బ్యాంక్‌కు చెందిన అన్ని ఆస్తులు, బాద్యతలు, శాఖలు సరస్వత్ బ్యాంక్‌లో విలీనమవుతాయి. ఇదే సందర్భంలో, NICBL ఖాతాదారులందరూ ఇకపై సరస్వత్ బ్యాంక్ కస్టమర్లుగా పరిగణించబడతారు. వారి డిపాజిట్లు, ఇతర లావాదేవీలకు పూర్తి రక్షణ ఉంటుందని RBI స్పష్టం చేసింది.
RBI Approved – కేంద్ర బ్యాంకు చట్ట ప్రకారం చర్యలు
ఈ విలీనాన్ని బ్యాంకింగ్ నియంత్రణ చట్టం, 1949లోని సెక్షన్ 44A(4) ప్రకారం, సెక్షన్ 56తో కలిపి RBI ఆమోదించింది. గత కొన్ని నెలలుగా న్యూ ఇండియా కో-ఆపరేటివ్ బ్యాంక్ పరిపాలనలో అవకతవకలు, మేనేజ్‌మెంట్ ఉల్లంఘనలు, రూ.122 కోట్ల మేర నిధుల దుర్వినియోగ ఆరోపణలు నేపథ్యంలో ఆ బ్యాంక్ నియంత్రణా పరిశీలనలో ఉంది.
వాటాదారుల ఆమోదంతో ముందుకుసాగిన ప్రక్రియ
విలీనానికి సంబంధించి జూలై 22, 2025న సరస్వత్ బ్యాంక్ నిర్వహించిన ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో వాటాదారులు ఏకగ్రీవంగా అంగీకారం తెలిపారు. అదే విధంగా, న్యూ ఇండియా బ్యాంక్ వాటాదారులు వార్షిక సమావేశంలో విలీనానికి అనుమతి ఇచ్చారు. అనంతరం దీనిని RBIకి పంపగా, ఆమోదం లభించింది.
గ్రాహకులకు ప్రయోజనాలు
విలీనంతో, న్యూ ఇండియా బ్యాంక్ కస్టమర్లకు విస్తృత సేవలతో కూడిన పెద్ద సహకార బ్యాంక్ సేవలు అందుబాటులోకి వస్తాయి. డిజిటల్ బ్యాంకింగ్, లోన్ సదుపాయాలు, ఇతర సేవల వినియోగంలో వీరికి మరింత విస్తృత అవకాశం లభిస్తుంది.
Also Read : RBI Shocking : 2 వేల నోట్లపై కీలక అప్డేట్ ఇచ్చిన రిజర్వ్ బ్యాంక్
