Jadeja : గుజరాత్ : ప్రముఖ భారత క్రికెటర్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఆనందం వ్యక్తం చేశారు. తన భార్యకు తాజాగా గుజరాత్ కేబినెట్ విస్తరణంలో చోటు దక్కడం పట్ల స్పందించారు. శనివారం ఎక్స్ సామాజిక వేదికగా స్పందించారు. తాము ఎంతో కష్టపడి పైకి వచ్చామన్నారు. తను కూడా పార్టీని బలోపేతం చేయడంతో పాటు అండగా ఉంటూ వచ్చారని పేర్కొన్నాడు. తను సాధించిన విజయాలను చూసి తనకు ఎంతో గర్వంగా ఉందన్నాడు జడేజా (Jadeja). తను ప్రస్తుతం ఆస్ట్రేలియా పరట్యనలో భారత జట్టు తరపున ఆడుతున్నాడు. పదవి దక్కడం అనేది మామూలు విషయం కాదన్నాడు. కష్టపడితే చాలు విజయం సాధించ వచ్చని, అనుకున్నది సాధించ గలమని నువ్వు నిరూపించావంటూ తన భార్యను ఉద్దేశించి పేర్కొన్నాడు. ప్రశంసల జల్లులు కురిపించాడు రవీంద్ర జడేజా.
Jadeja Wife Gets Ministry
తన భార్యకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కల్పించడం పట్ల భారతీయ జనతా పార్టీకి, ప్రత్యేకించి దేశాన్ని అభివృద్ది పథంలో ముందుకు తీసుకు వెళుతున్న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర దాస్ మోదీకి, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ చంద్ర షాకు, బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు. పదవి దక్కడం ఆ దేవుడు తమకు ఇచ్చిన వరంగా తాను భావిస్తున్నట్లు తెలిపారు రవీంద్ర జడేజా. ఇదిలా ఉండగా ఎవరూ ఊహించని రీతిలో గుజరాత్ ప్రస్తుత కేబినెట్ ను పూర్తిగా రద్దు చేసింది. కొత్తగా మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు.
Also Read : MP Asaduddin Owaisi Shocking Comments : ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ షాకింగ్ కామెంట్స్
