Asaduddin Owaisi : హైదరాబాద్ : ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ (Asaduddin Owaisi) సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన భారత రాష్ట్ర సమితి పార్టీ అభివృద్ది పరంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఆయన జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచిన నవీన్ యాదవ్ కు సంపూర్ణంగా మద్దతు ఇస్తున్నామని అన్నారు. ఇదిలా ఉండగా సదరు అభ్యర్థిపై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం జూబ్లీ హిల్స్ శాసన సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరుగుతోంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి చెందిన మాగంటి సునీతను బరిలో దించారు ఆ పార్టీ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. ఇదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించిన ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అనారోగ్యంతో కన్నుమూశారు. దీంతో ఇక్కడ ఎన్నిక అనివార్యంగా మారింది.
MP Asaduddin Owaisi Shocking Comments
కేంద్ర ఎన్నికల సంఘం బీహార్ రాష్ట్రంలో శాసన సభ ఎన్నికలతో పాటు జూబ్లీ హిల్స్ కు సంబంధించి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక భారతీయ జనతా పార్టీ నుంచి లంకాల దీపక్ రెడ్డిని ప్రకటించింది. దీంతో ఇక్కడ పోటీ నామ మాత్రంగానే ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో పోటీ కొనసాగుతోంది. పార్టీ పరంగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా తయారైంది పరిస్థితి. ప్రధానంగా 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కావాలని పెద్ద ఎత్తున ఆందోళన బాట పట్టారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చారు.
Also Read : Minister Savitha Clear Orders : విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలి
