హైదరాబాద్ : రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ నెరెళ్ల శారదను కలిశారు మల్లారెడ్డి విద్యాపీఠం వైస్ చైర్పర్సన్ ప్రీతి రెడ్డి. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చేందుకు తాను వచ్చానని ప్రీతి రెడ్డి తెలిపారు. 365 రోజుల్లో కేవలం మూడు క్యాంపస్‌లలో మాత్రమే మూడు కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని చెప్పారు. తరగతులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ కార్యక్రమాలను చేపట్టాం అని తెలిపారు ప్రీతిరెడ్డి. కమిషన్ చైర్ పర్సన్ ను కలిసిన అనంతరం ప్రీతి రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం , ఇటీవల ఉన్నత విద్యా మండలి జారీ చేసిన ఆదేశాలను తప్పకుండా పాటిస్తామని అన్నారు .
కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు యాజమాన్యం, విద్యార్థులు ఇద్దరూ జాగ్రత్తగా ఉండాలని అన్నారు. …
వైస్ చైర్‌పర్సన్‌గా, కమిషన్ అడిగిన అన్ని ప్రశ్నలకు తాను పూర్తిగా సమాధానాలు ఇచ్చానని తెలిపారు ప్రీతి రెడ్డి . ఇదిలా ఉండగా తమ సంస్థ పూర్తిగా విద్యార్థులకు స్వేచ్ఛ ఉందన్నారు. ఇదిలా ఉండగా ఇటీవల సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చేపట్టారు మల్లారెడ్డి విద్యా సంస్థల ప్రాంగణంలో. కొన్ని పొరపాట్లు చోటు చేసుకున్నాయి. యష్ నటించిన టాక్సిక్ తో పాటు ఇటీవల త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఆదర్శ కుటుంబం కార్యక్రమం జరిగింది. విద్యా సంస్థలా లేక ప్రమోషన్ కార్యక్రమాలకు వేదికలా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.



















