Ponnam Prabhakar : హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ తన సహచర మంత్రి మాదిగ సామాజిక వర్గానికి చెందిన అడ్లూరి లక్ష్మన్ ను ఉద్దేశించిన కామెంట్స్ . మరింత చర్చకు దారితీసేలా ఉండడంతో గత్యంతరం లేక పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) బుధవారం స్పందించారు. తనను ఉద్దేశించి దున్నపోతులా ఉన్నాడంటూ కామెంట్ చేయడం, ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియో స్పష్టంగా బయటకు రావడంతో రాద్దాంతం చేసుకుంది. దీనిపై సీరియస్ గా స్పందించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. దళిత సామాజిక వర్గానికి చెందిన తనకు మంత్రి పదవి రావడంతో సహచర మంత్రి బీసీ అయి ఉండి కించ పర్చడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తాడో పేడో తేల్చుకుంటానంటూ ప్రకటించారు. దీంతో ఈ వివాదం చిలికి చిలికి గాలి వానగా మారింది.
Minister Ponnam Prabhakar Comments
ఈ అంశం సీరియస్ కావడం, పార్టీకి డ్యామేజ్ అవుతుందని గమనించారు రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇంఛార్జ్ . దీంతో ఉన్నట్టుండి బుధవారం మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. తాను అన్న మాటలకు మనసు నొప్పిస్తే క్షమించాలని కోరారు. విచారం వ్యక్తం చేశారు. రాజకీయ దురుద్దేశంతో నా వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారంటూ వాపోయారు. ఇదిలా ఉండగా మంత్రి పొన్నం ప్రకటనపై సంతృప్తి చెందడం లేదంటూ పేర్కొన్నారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. చింతిస్తున్నా అనడం కంటే పొరపాటు జరిగింది అంటే బాగుండేదని అన్నారు. పొన్నం మాట్లాడిన మాటలు రాష్ట్రం అంతా చూసిందన్నారు.
Also Read : IT Shocking Raids : తెలుగు రాష్ట్రాలలో రూ. 400 కోట్ల దాల్ స్కామ్
