IT : అమరావతి/ హైదరాబాద్ : ఆదాయానికి మించి వ్యాపారాలు చేస్తున్నారని, జీఎస్టీ ఎగవేతకు పాల్పడినట్లు గుర్తించింది ఆదాయ పన్ను శాఖ (IT). ఈ మేరకు ఇటు ఏపీలో , అటు తెలంగాణ రాష్ట్రాలలో ఝలక్ ఇచ్చింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండానే దాడులు ప్రారంభించింది. ఏకంగా ఈ రెండు రాష్ట్రాలలో పప్పు ధాన్యంకు సంబంధించి భారీ ఎత్తున కుంభకోణం చోటు చేసుకున్నట్లు గుర్తించింది. రెండు రాష్ట్రాలకు కలిపి ఏకంగా రూ. 400 కోట్ల మేర స్కామ్ జరిగినట్లు అంచనా వేసింది. అయితే ఇంకా ఆదాయ పన్ను శాఖ నుంచి క్లారిటీ రాలేదు. ఇది పక్కన పెడితే నిన్న తెలంగాణలోని పలు జిల్లాల్లో దాడులు చేపట్టగా బుధవారం ఏపీలో విస్తృతంగా సోదాలు నిర్వహించింది.
IT Raids in Both Telugu States
ఏపీలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. దాడులు చేపట్టారు. పలు దాల్ (పప్పు) మిల్లులను తనిఖీ చేశారు. గత కొన్నేళ్లుగా నకిలీ కందిపప్పు, పెసరపప్పు తయారు చేస్తున్నట్లు పలు ఫిర్యాదులు అందాయి. వినుకొండకి చెందిన మిల్లు వ్యాపారి శ్రీనివాసరావు ఇళ్లు, పప్పు మిల్లుల్లో దాడులు చేపట్టారు. ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఐటీ శాఖకు ఫిర్యాదులు పెద్ద ఎత్తున అందాయి. సోదాలలో భాగంగా గుంటూరు, వినుకొండ, తెనాలి, విజయవాడ, కర్నూలులో సోదాలు నిర్వహించారు. శ్రీనివాసరావు ఇళ్లు, మిల్లుల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దాల్ మిల్లుల్లో రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.
Also Read : TTD Diwali Special Important Update : 20న శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం
