ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ సేవ‌లందించాలి

మంత్రులు, ఎమ్మెల్యేలకు సీఎం చంద్ర‌బాబు దిశానిర్దేశం

hellotelugu-ApCabinet

అమ‌రావ‌తి : స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో స‌త్తా చాటినా ప్ర‌జ‌ల‌కు నిరంత‌రం అందుబాటులో ఉండేందుకు ప్ర‌య‌త్నం చేయాల‌ని స్ప‌ష్టం చేశారు సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు. మంగ‌ళ‌వారం సీఎం అధ్యక్షతన రాజధాని అమరావతిలో కేబినెట్ భేటీ అయింది. ఈ సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. అలాగే పలు కీలక విషయాల్లో మంత్రులకు ఆయన దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల విజయాన్ని చూసుకొని గర్వంతో విర్రవీగొద్దని మంత్రులకు సీఎం స్పష్టం చేశారు. ఒద్దికగా ఉండండి.. భవిష్యత్తుపై దృష్టి పెట్టాలని సూచించారు. ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలని వారిని అప్రమత్తం చేశారు. మనం ప్రజలకు మేలు చేయాలని వారితో సీఎం అన్నారు. అభివృద్ధి, సంక్షేమం సమపాళ్లలో చేస్తున్నామని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు గుర్తు చేశారు.2029 ఎన్నికలపై దృష్టి పెట్టాలని.. ఆ దిశగా అందరం పని చేయాలని అన్నారు.

ఇక కూరగాయల ధరలు తగ్గాయని.. బియ్యం ధరలు కూడా తగ్గించేందుకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు తెలిపారు. ప్రజలకు ధరల భారం ఉండకూడదని అన్నారు. మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా ప్రజలకు ఉపయోగ పడాలని ఈ కేబినెట్ భేటీలో సీఎం పేర్కొన్నారు. ఇక పంచాయతీ ఎన్నికలు పూర్తయిన తరువాత సొసైటీ ఎన్నికలు ఉంటాయని తెలిపారు. అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని సూచించారు. ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత మనమంతా అభివృద్ధిపై దృష్టి పెట్టాలని అన్నారు నారా చంద్ర‌బాబు నాయుడు. బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో రైతు బజార్లలో ధర తగ్గించి బియ్యం విక్రయిస్తున్నామని ఈ సందర్భంగా పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఆర్నబ్, మురసు తుఫాన్ నేపథ్యంలో కర్ణాటక, తెలంగాణ నుంచి వచ్చిన సిబ్బంది విద్యుత్ పునరుద్ధరణకు బాగా పని చేశారని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ చెప్పారు.

Exit mobile version