Modi Fired on Pakistan : పాకిస్తాన్ దాడి చేస్తానంటే ‘రెఢీ’ అన్నా – మోదీ

లోక్ స‌భ సాక్షిగా ఆప‌రేష‌న్ సిందూర్ పై ప్ర‌ధాని

hellotelugu-modiwans

Modi : న్యూఢిల్లీ – పాకిస్తాన్ యుద్దానికి దిగుతోంద‌ని భార‌త్ పై అంటూ నాకు ఫోన్ చేశారు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ అన్నారు ప్ర‌ధాని మోదీ. లోక్ స‌భ సాక్షిగా ఈ విష‌యాన్ని పంచుకున్నారు. ఈ సంద‌ర్బంగా తాను వాన్స్ కు ఒక్క‌టే చెప్పాను. భార‌త్ వెన‌క్కి త‌గ్గేది లేద‌ని, తాడో పేడో తేల్చుకునేందుకు సిద్దంగా ఉన్నామ‌ని ఆయ‌న‌కు స్ప‌ష్టం చేశాన‌ని అన్నారు. ఇదే విష‌యం ఆ దేశ అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కూడా ఇదే విష‌యం చెప్పాను. గ‌తంలో ఇండియాలో చేత‌కాని స‌ర్కార్ లేద‌ని ప్ర‌క‌టించాన‌ని అన్నారు. ఇక్క‌డ ఉన్న‌ది మోదీ. యుద్దానికి మేం సిద్దం. కానీ పాకిస్తాన్ ను వెంటాడి, వేటాడుతూనే ఉంటామ‌ని చెప్పాన‌న్నారు.

Modi Slams Pakistan

మే 9న నాతో మాట్లాడేందుకు అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ చాలాసార్లు ప్ర‌య‌త్నం చేశాడు. కానీ నేను ఆ స‌మ‌యంలో ఫుల్ బిజీగా ఉన్నాన‌ని అన్నారు. జేడీ వాన్స్ చాలాసార్లు కాల్ చేశాడు.. పాకిస్థాన్‌ భారీగా దాడులు చేయబోతోందని వాన్స్ నాతో చెప్పాడని అన్నారు మోదీ (Modi).. పాక్ ఎలాంటి దాడి చేసినా చూసుకుంటామని ఆయ‌న‌కు నేను చెప్పాను.. పాకిస్థాన్‌ మూల్యం చెల్లించుకోక తప్పదని వాన్స్‌తో చెప్పా. పాక్ అజెండాను ఇంపోర్ట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోంద‌ని ఆరోపించారు మోదీ.

మొత్తంగా పాకిస్తాన్ స‌త్తా ఏమిటో యావ‌త్ ప్ర‌పంచానికి తెలిసి పోయింద‌న్నారు. వాళ్ల‌ను లేవ‌కుండా దెబ్బ కొట్టామ‌న్నారు. చివ‌ర‌కు భార‌త్ దాడుల దెబ్బ‌కు పాకిస్తాన్ కోలుకోలేని స్థితికి చేరుకుంద‌న్నారు. చివ‌ర‌కు కాళ్ల బేరానికి వ‌చ్చింద‌న్నారు. చివ‌ర‌కు క్ష‌మించ‌డం జ‌రిగింద‌న్నారు.

Also Read : PM Modi Strong Counter : రాహుల్ కామెంట్స్ మోదీ స్ట్రాంగ్ కౌంట‌ర్

Exit mobile version