PM Modi Strong Counter : రాహుల్ కామెంట్స్ మోదీ స్ట్రాంగ్ కౌంట‌ర్

కాంగ్రెస్ హెడ్ లైన్స్ లో ఉంటుంది మేం కాదు

Hello Telugu - PM Modi Strong Counter

Hello Telugu - PM Modi Strong Counter

PM Modi : న్యూఢిల్లీ – లోక్ స‌భ సాక్షిగా నిప్పులు చెరిగారు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ (PM Modi). ఎంపీ రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. నీకు అంత సీన్ లేద‌న్నారు. కాంగ్రెస్ పార్టీ నిత్యం హెడ్ లైన్స్ లలో ఉండేందుకు ప్ర‌య‌త్నం చేస్తుంద‌న్నారు. కానీ తాము 143 కోట్ల మంది భార‌తీయుల హృద‌యాల‌లో ఉంటామ‌న్నారు మోదీ. పాకిస్థాన్‌పై చేసిన దాడుల ఫోటోలను కాంగ్రెస్ అడుగుతోందని, విచిత్రంగా ఉంద‌న్నారు. దేశ ఆంత‌రంగిక భ‌ద్ర‌త దృష్ట్యా అవి బ‌య‌ట‌కు విడుద‌ల చేయ‌డం సాధ్యం కాద‌ని, ఆ విష‌యం ఎంపీ రాహుల్ గాంధీ తెలుసుకుంటే మంచిద‌ని హిత‌వు ప‌లికారు.

PM Modi Strong Counter to Rahul Gandhi

రాహుల్ గాంధీకి స్ట్రాంగ్ కౌంట‌ర్ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు మోదీ. సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చామ‌ని అన్నారు. పహల్గాం ఘటనకు ప్రతీకారం తీర్చుకుంటామని చెప్పి, చేసి చూపించామ‌న్నారు.. పాకిస్థాన్‌లోకి చొచ్చుకెళ్లి మరీ ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేశామ‌ని, యావ‌త్ ప్ర‌పంచం క‌ళ్ల‌ప్ప‌గించి చూసింద‌న్నారు. దీంతో భార‌త్ స‌త్తా ఏమిటో లోకం చూసింద‌న్నారు. పాకిస్థాన్‌లోని టెర్రరిస్టు హెడ్‌ క్వార్టర్స్‌ను ధ్వంసం చేశామ‌న్నారు.. పాక్ అణు బెదిరింపుల‌ను లెక్క‌లోకి తీసుకోలేద‌న్నారు మోదీ. పథకం ప్రకారమే ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టామ‌న్నారు. భారత్ ప్రతీకార చర్యను చూసి పాక్ బిత్తర పోయిందన్నారు. కలుగులో దాక్కున్న ముష్కరులకు పొగబెట్టి మరీ మట్టుబెట్టామ‌న్నారు. పాక్ అణ్వాయుధ బెదిరింపుల్లో నిజం లేదని తేలి పోయింద‌న్నారు.

Also Read : PM Modi Shocking Comments : భార‌త్ స‌త్తా చాటింది పాక్ త‌ల‌వంచింది

Exit mobile version