PM Modi : అస్సాం : భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని ఏకి పారేశారు. సంచలన ఆరోపణలు చేయడం కలకలం రేపింది. దాయాది పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు , అక్రమంగా దేశంలోకి ప్రవేశిస్తున్న చొరబాటుదారులకు నిస్సిగ్గుగా మద్దతు ఇస్తున్నారంటూ మండిపడ్డారు. ఆదివారం అస్సాంలో పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్బంగా జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీ వల్ల ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా స్కాంలు, అవినీతి చోటు చేసుకుందన్నారు. కానీ 2014 నుంచి కొలువు తీరిన తాము వచ్చాక దేశం సీన్ మారి పోయిందన్నారు. అన్ని రంగాలలో టాప్ లో కొనసాగుతోందని చెప్పారు.
PM Modi Clear Warning
దేశాన్ని అవినీతి రహిత దేశంగా తీర్చి దిద్దడమే లక్ష్యంగా పని చేస్తున్నామని అన్నారు ప్రధానమంత్రి. పహల్గామ్ ఘటనలో 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన సందర్బంగా భారత ప్రభుత్వం పాకిస్తాన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చిందన్నారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా కోలుకోలేని షాక్ ఇచ్చామన్నారు. తాము కొట్టిన దెబ్బకు దాయాది దేశం విల విల లాడుతోందన్నారు. ఇలాంటి తరుణంలో కీలక పాత్ర పోషించిన ఆర్మీ, నేవి, రక్షణాత్మక దళాలకు భరోసా ఇవ్వాల్సింది పోయి పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులకు నిస్సిగ్గుగా , దేశం , యావత్ జాతి తల దించుకునేలా సపోర్ట్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు నరేంద్ర దామోదర దాస్ మోదీ.
ఇదిలా ఉండగా తమ పార్టీపై నిరాధారమైన ఆరోపణలు చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. తన చేతకాని పాలనతో దేశాన్ని వెనక్కి నెట్టేసిన ఘనత మోదీకే దక్కుతుందని మండిపడింది. ఆయన ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరన్నారు.
Also Read : Nirmala Sitharaman Important Updates : స్లాబ్ రేట్ల తగ్గింపుతో ఆర్థికాభివృద్ది
